Click here to buy eBook.
| దేశవిదేశీ యాత్రా విశేషాలు నేను హాలెండ్‌లోని ఆమ్‌స్టర్ డామ్, హేగ్, రోటర్‌డామ్, బ్రసెల్సు, పారిస్, వాటికన్ సిటీ, ఇటలీలోని పిసా, రోమ్, వెన్నిస్ పట్టణము, దుబాయ్, నేపాల్‌లో కాట్మాండు, పోఖర పట్ట ణము, మలేషియా, సింగపూరు, శ్రీలంక, దక్షిణాదిలో కేరళ, తమిళనాడులోని ముఖ్య క్షేత్రాలు సందర్శించినాను. ఆయా దేశాలు, పట్టణములు, దేవాలయాలు, మ్యూజియములు వాటి చరిత్ర, ప్రాముఖ్యత, విశేషాలు చాలా నిశితంగా పరి శీలించి, వివరాలు సేకరించి ఇందులో ఫోటోలతో సహా పొందు పరచడం జరిగింది. యూరప్‌లో సూర్యోదయం 5 గంటలకు, సూర్యా స్తమయం 11 గంటలకు జరుగుతుంది. రామేశ్వరంలో నీటిపై తేలే రాళ్ళు, కృతయుగం మనిషిది 41 అడుగుల సమాధి ఉన్నాయి. ఇటలీలోని పిసానగరంలో లీనింగ్ టవర్, రోమ్‌లో ప్రపంచ ఏడువింతల్లో ఒకటైన కాలోసియం మరియు ఎన్నో విశేషాలు తెలుపబడినవి. ఈ పుస్తకం చదివిన వారు తప్పక ఏవో కొన్ని కొత్త విషయాలు తెలుసుకున్న అనుభూతి, తృప్తి కలుగుతుందని భావిస్తున్నాను. | Top | Click here to buy eBook.
| భారతీయ యోగ సమ్మేళనం మానవుడు సుఖంగా జీవించుటకు మంచి ఆరోగ్యం, ప్రశాంతమైన మనసు, ఆత్మ విశ్వాసం, దృఢ సంకల్పం, దైవ భక్తి అవసరం. అటువంటి స్ధితిలోకి మనిషి రావడానికి మంచి ఆహారం, గాలి, నీరు, క్రమశిక్షణ, నిత్య వ్యాయామం, సత్సాంగత్యం అవసరం. సృష్టిలో కొన్ని నియమాలు ధర్మాలు ఉన్నాయి. మన కోసం సృష్ఠి ధర్మాలు మార్పు చెందవు. వాటికి అనుకూలంగా జీవన విధానాన్ని మార్చుకోగలిగిన వారి జీవితం క్షేమం, ధన్యం. సృష్టి ధర్మాలననుసరించి తీసుకోవలసిన ఆహారం, విధానము, వ్యాయామం, యోగాసనములు, ప్రాణాయామం, ధ్యానం చాలా వివరంగా తెలుపబడినవి. వివిధ యోగులు, యోగ మాస్టార్లు నేర్పిన పద్ధతులు ఇందులో తెలుపబడినవి. మరియు సిద్ధ సమాధియోగ, శ్రీ రవిశంకర్ గారి ఆర్ట్ ఆఫ్ లివింగ్, శ్రీ ప్రసాద్ మాస్టారు క్రియా యోగ, శ్రీ గురు రాందేవ్ ప్రాణాయామం, పరమహంస యోగానంద క్రియా యోగ, శ్రీ లహరీ గారి జీవిత చరిత్ర, క్రియా యోగలో వారి బోధనలు, 5000 ఏండ్ల నుండి చిరంజీవిగా వున్న బాబాజీ గారి జీవిత చరిత్ర, 280 సం॥ములు జీవించిన ఆంధ్రయోగి త్రైలింగ స్వామి, ఇంకా హిమాలయ యోగులు గురించి, ఆహారం, నీరు తీసుకోకుండా ప్రాణశక్తిత జీవించిన గిరిబాల గురించి, మొదలగు యోగ, వేదముల రహస్యాలతో మీ సందేహాలు తీర్చుకుని మీ జీవిత గమ్యం నిర్ణయించుకోవడానికి చక్కగా ఈ పుస్తకం ఉపయోగపడగలదని నమ్ముచున్నాను. | Top |
Click here to buy eBook.
|
సత్సంగ సంకలనం దేవుడు ఉన్నాడా? ఎక్కడున్నాడు? ఏమి చేస్తుంటాడు? మానవులుగా జన్మించినందుకు సమాజంలో బాధ్యతలుంటాయా? ఉంటే వాటిని నెరవేర్చేందుకు దైవశక్తి ఏ విధంగా తోడ్పడుతుంది? ఈ చరాచర జగత్తుకు ఆధారం ఎవరు? ఎటువంటి దానధర్మాలు మంచి ఫలితాలిస్తాయి? యువశక్తి సమాజానికి ఏ విధంగా ఉపయో గించుకోవాలి? మంచి వాక్కు, సహనం ఫలితాల లెలా ఉంటాయి? ధానం ఎవరి వద్ద పుచ్చు కోకూడదు? ధర్మం ఏ విధంగా రక్షిస్తుంది? పూర్వ జన్మ కర్మలు ఈ జన్మలో ఏ విధంగా అను భవిస్తాము. వాటిని అదిగమించవచ్చా? నిస్వార్థ సేవ ఏ విధంగా ఉండాలి? విశ్వ ప్రేమ ఏ విధంగా ఉంటుంది. కాలం విలువ గురించి, ప్రారబ్ద కర్మను ఏ విధంగా అధిగమించవచ్చును? ఈ విషయాల గురించి చాలా వివరంగా, పురాణగాథలు, యదార్థ గాధలతో ఉదహరించడం జరిగింది. శాస్త్రోక్తంగా గృహ వాస్తు శాస్త్రం గురించి స్వీయానుభవం వ్రాయడం జరిగింది. వృద్ధా ప్యంలో ఏ విధంగా ఉండాలి? సమస్యలు ఏ విధంగా అధిగమించాలి? వృద్ధాశ్రమల వివరాలు, 45 వృద్ధాశ్రమల చిరు నామాలు, ఫోన్ నెంబర్లతో తెలపడం జరిగింది. ఆయుర్వేద మందులు, వ్యాధులు, వాటికి ఆయుర్వేద చిట్కాలు, మూలికల గురించి తెలపడం జరిగింది. | Top |
Click here to buy eBook.
| విశ్వవిఖ్యాత బలాఢ్యులు క్రీడలలో ప్రవేశ వయస్సు ఎవరు ఏ క్రీడలలో రాణించుతారు అనే వివరములు, అన్ని వయసుల సాధారణ వ్యక్తులు మరియు క్రీడాకారులు చేయవలసిన వ్యాయామాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు, ఆరోగ్య నియమాలు వివరించబడినవి. యుద్ధక్రీడ (మార్షల్ ఆర్ట్స్) లయిన మల్లయుద్ధము, బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్, బాడీబిల్డింగ్, యోగ విద్య, కర్రసాము, కరాటే విద్యల పుట్టుక, పూర్వ చరిత్ర వాటి సాధనాంశములు, సాంకేతికపరమైన సూక్ష్మాలు సంబంధిం చిన బొమ్మలతో సహా వివరంగా తెలపడమైనది. అదియును గాక మహాబల సంపన్నులు ‘‘కలియుగ భీముడు’’ అయిన కోడి రామ్మూర్తి గారు దేశ విదేశాలలో ప్రదర్శించిన బల ప్రదర్శనలు గురించి తెలపడమైనది. రామ్మూర్తి గారు, అతని శిష్యులు బలవంతులు కావడానికి చేసిన యోగా వ్యాయామ రహస్య క్రియల గురించి తెలపడమైనది. కుస్తీలతో విశ్వవిజేతై, తనకు 70 సంవత్సరముల వయస్సు వచ్చినా ప్రపంచ యోధులకు సవాలు విసిరిన ‘‘గామా పహిల్వాన్’’ విన్యాసాలు, అతని చరిత్ర, అతనికి ధీటైన పోటీ ఇచ్చిన ‘‘రహిం సుల్తాన్ వాలా’’ స్టాన్సిలస్ జిబిస్తో’’ల గురించి వివరించడమైనది. బాక్సింగ్ రారాజులైన మహ్మాదాలి, హోలిఫీల్డు, టైసన్, లునెక్స్ లూవీస్‌ల గురించి బాడీ బిల్డింగ్ ఏడుసార్లు మిస్టర్ యూనివర్స్ విజేత ప్రఖాత టెర్మినేటర్ సినిమా హీరో, ప్రస్తుత అమెరికా స్టేట్ గవర్నరైన ఆర్నాల్డ్ స్క్వార్జ్ నెగ్గర్ మరియు ఒకమారు మిస్టర్ యూనివర్స్ అయిన ప్రస్తుతం 97 సంవత్సరాల వయస్సులో వ్యాయామం చేస్తూ 54 అంగుళముల రొమ్ము 23 అంగుళముల నడుము కొలతలు గలిగిన ‘‘మనోహర్ ఏచ్’’ గురించి, గొప్ప ప్రపంచ రికార్డులు సాధించిన రష్యా వెయిట్ లిఫ్టర్స్ గురించి, కరాటే విద్యకు ప్రపంచ ప్రఖ్యాతి గలిగేట్లు చేసి, అద్భుత శక్తి కనబరచిన ‘‘బ్రూస్లీ’’ గురించి కర్రసాము, విలువిద్య గురించి వాటిలో ప్రఖ్యాత వ్యక్తులు గురించి వివరించడం జరిగింది. క్రీడా వ్యాయామంలోను, ఆరోగ్యపరమైన కీలకాంశాలు పొందు పరిచినందున క్రీడాకారులకు, సామాన్యులకు మార్గదర్శి కాగలదని నమ్ముచున్నాను. | Top | Click here to buy eBook.
| STRONGEST MEN OF THE WORLDThe aim of writing this book about the World Famous Strong Men and New Systems of the Sports items is to inspire the modern youth and encourage them to possess a healthy body and a sound mind. The book gives a brief account of the ancient Indian methods of physical exercises and the present day facilities available for the youth to gain proficiency in sport items of their choice as also the diet details and calorie contents of the food eaten. The martial arts like Wrestling. Boxing, Weight Lifting, Body-Building, Special Yoga Methods to gain extraordinary strength, Stick Fighting, Karate, Judo etc., have been discussed in detail, with brief histories and the technical skills they need with illustrations and photographs wherever necessary. The book discusses the right age for the youth to take to sports, who among them will make a mark and in which sport item. The exercises for the general public of all ages as well as youth, the care they should take, the principles of health etc., have been discussed in the book. The book focuses on the Indian Champions who achieved International fame by dint of sheer hardwork and single-minded devotion to the sport they chose to master. The Strongmen of Andhra Pradesh also have been discussed in the book. In addition, the book deals with the champions of different countries who won International recognition in their fields of specialization. The highlights of the book are the life and achievements of the Indian Strongmen like ‘Kaliyuga Bheema’ Kodi Ramamurthy Naidu of World fame, Gama Phailwan of equal greatness in his field who both demonstrated to the Indian system of training is in no way inferior to the western methods, if not superior to these of the west. Other equally powerful fighters like Rehim Sultanwala and Stansilas Zybesco have also been discussed in detail. The boxing kings Mohammed Ali, Holifield, Tyson, Lunnex Luwis, the seven times Mister Universe title holder Arnold Squartznaggar and the 97 year old Monohar Aich have been discussed with relevant details as also the Russian Weight Lifters. An account have been detailed about the Karate King Burce Lee, his life and achievements. Along with these specialized world sports, the Indian art of archery also been included. The Author himself is a sports enthusiast with personal experience in the field of physical exercises for building a good body and healthy living. He has authored many books of general interest. It is hopped that this book would help the youth as a guide and reference book and encourage them to gain proficiency in their chosen field and bring credit to the State and the Country like the World Masters of the earlier times. | Top | Click here to buy eBook.
| జీవన కెరటాలు ‘అప్రాప్యం నామ నేహూస్తి ధీరస్య వ్యవసాయినా’ అంటే ఎడతెగకుండా కృషి చేసే వారికి లోకంలో పొందరానిదంటూ ఏదీలేదు. ఎంచుకున్న రంగంలో ఎలాంటి ఫలాపేక్ష లేకుండా కర్మయోగిలా పనిచేసుకుంటూ పోవాలి. అప్పుడు పేరు తనంతట తానే వస్తుంది. కీర్తి నీడలాంటిది. అందుకుందామని వెంటపడితే పరుగుతీస్తుంది. పట్టించుకోకుండా మన పనివైపు మనం పయనిస్తుంటే అదే మన వెంట పడుతుంది. ప్రస్తుతం మనం అనుభవిస్తున్న ఎన్నో ఆధునిక శాస్త్ర విజ్ఞాన ఫలాల వెనుక ఇలా కర్మ యోగుల్లా ఎందరో కృషి చేశారన్న విషయాన్ని మనం గుర్తిం చాలి. కేవలం తమను ఆ విధాత ఒక బాద్యతను కొంగున కట్టి ఈ ప్రపంచానికి పరిచయం చేశాడని తెలుసుకున్నారు. ఆ మార్గంలో పయనిం చారు. జీవితాల్ని సార్ధకం చేసుకున్నారు. ఫలితం, పేరు ప్రఖ్యాతులు వాటంతట అవే వారికి ప్రసాదంగా లభించాయి. పేరు ప్రఖ్యాతులపై ప్రీతిని అధిగమించి శ్రమించాలి. చాలా అజ్ఞాతంగా, ఆడంబరాలకు దూరంగా కృషి చేస్తూ ఉంటే మారుమూల పల్లెలో కూర్చున్నా ప్రపంచం మనసు అన్వేషించుకుంటూ వస్తూంది. కీర్తి కిరీటాలను వెంట తెస్తుంది. మనలో ఉన్న ప్రతిభ వెనుక ఒక మహాశక్తి పనిచేస్తుందనీ, మనం ఆ శక్తికి వినియోగ పడు తున్న పరికరాలేనన్న భావన ఉన్నప్పుడే అజ్ఞాతంగా పనిచేయగలం. అద్భుతాలను సాధించగలం. సంకల్ప బలం ఉండాలి. . . సాహసం తోడు కావాలి. అంతులేని అన్వేషణ. . . విరామం లేని పరిశ్రమ కలగలిస్తే కలిసిగట్టుగా ప్రయాణిస్తే ` విజయం పెంపుడు పావురం లాగా ఎగిరొచ్చి భుజం మీద వాలుతుంది. 1. ఐశ్వర్యం మన ప్రవర్తనను గమనించుకునే అవకాశం ఇవ్వదు. పేదరికంలోనే ఆత్మ పరిశీలన చేసుకునే సదవకాశం లభిస్తుంది. 2. కష్టాలు మనలోని అంతర్గత శక్తిని వ్యక్త పరిచేందుకు తోడ్పడేవే కానీ అపజయాలకు గురి చేసేవి కావు. 3. పేదరికం, శాపం కాదు, అది మన కార్యసిద్ధికి సహకరించే ఒక సాధనం. 4. కర్మయోగిలా జీవిత ఎత్తు పల్లాల మార్గంలో కొద్ది చదువుతో పల్లెనుండి బయలుదేరి అంతర్జాతీయ స్ధాయి వ్యక్తులతో పనిచేసి జీవితాశయాలు నెరవేర్చుకున్న వ్యక్తి అనుభవసారం, సమాజమునకు పనికి వచ్చే విధంగా మలిచి వ్రాసిన పుస్తకమే ఇది! | Top | Click here to buy eBook.
| సృష్టి సమన్వయం-క్రమశిక్షణప్రస్తుత విద్యా విధానం విలువల్ని పెంపొందించడంలో విఫలమైంది. వ్యక్తిత్వ వికాసానికి ఉపకరించదు. అది పూర్తిగా వ్యక్తిని తిరోగమన మార్గంలో నడుపుతుంది. పిల్లవాడు పాఠశాలకు వెళ్ళిన ప్రారంభ దశలోనే మొదట తండ్రి బుద్ధిహీనుడనీ, తాత పిచ్చివాడనీ, ఉపాధ్యాయులందరూ వంచకులనీ, పవిత్ర గ్రంథాలన్నీ అసత్యాలనే నేర్చుకుంటాడు. పిల్లవాడికి 16 సంవత్సరాలు వచ్చేసరికి నిరాశావాదిగా, అచేతనుడిగా, పిరికి పందగా రూపొందుతాడు అన్నారు స్వామి వివేకానంద. నేటి సమాజంలో విజయం సాధించిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. కానీ విలువలతో కూడిన వ్యక్తుల జాబితా మాత్రం వేళ్ళమీద లెక్కించగల సంఖ్యకే పరిమితమైంది. అందుకే విజయవంతమైన వ్యక్తిగా ఎదగడం కన్నా, విలువల గల వ్యక్తిగా మారడం ముఖ్యం. విజయానికి కావలసింది కేవలం మేధ! కానీ విలువున్న వ్యక్తిగా మారాలంటే కావలసింది ` శీలం’ అంటారు ఐన్‌స్టీన్. వ్యతిరేక భావాల్ని తరుచూ వినడం వల్ల మంచి మనస్సు ఉన్న వారు కూడా మారి చెడ్డవారవుతారు. పెద్దల పట్ల వినయ విధేయతల్నీ, ఉపాధ్యాయుల పట్ల గౌరవభావాన్ని కలిగి ఉండేలా, తాము నిజమని నమ్మిన దానికి ఎలాంటి పరిస్థితుల్లోనైనా కట్టుబడి ఉండేలా మన:స్ధైర్యాన్ని పెంపొందిస్తూ తల్లి తండ్రులు పిల్లలకు తగిన శిక్షణనివ్వాలి. సాక్షాత్తూ ఆ భగవంతుడే మెచ్చి, ముచ్చట పడి అవతారం దాల్చిన ధన్యభూమి భారతావని. భౌతిక సుఖాలతో, భోగ భాగ్యాలతో విలసిల్లుతూ ఆధునికతతో ఎంతో ముందున్నాయ నుకుంటున్న దేశాలు ఉనికి కూడా లేని వేల ఏళ్ళ క్రితమే, నవీన నాగరికత ఛాయలు ఉట్టిపడిన యోగభూమి మనది. గణితం నుంచి గగన ప్రయోగాల వరకు సమస్త రంగాలకు మన పరమపావన భారదతావనే తొలి పాఠశాల. కాని దురదృష్ట వశాత్తూ, ఈ తరం జాతి వారసత్వ వైభవాన్ని విస్మరిస్తోంది. అమ్మపెట్టిన ఆవకాయ మరచి పొరిగింటి పుల్లకూర కోసం అర్రులు చాస్తోంది. జర్మన్ కవి, రచయిత హెర్మన్‌మెస్సే ‘భారతదేశం ప్రపంచ పటంలోని ఒక భౌగోళిక పరమైన ఉనికి మాత్రమే కాదు. యావత్ ప్రపంచానికీ, మానవాళికీ దిశానిర్ధేశం చేసిన చారిత్రక వారసత్వం పుణికి పుచ్చుకున్న నేల ఇది’ అన్నారు. బహుభాషా కోవిదులు, పండితులు పి.వి. నరసింహారావు గారు ‘మానవ జీవన వ్యవస్ధకు ప్రాణాళికాబద్ధమైన విధివిధానాలను కూడా నిర్ధేశించిన కర్మభూమి మనది. వ్యక్తి కర్మానుసారంగా వర్ణవ్యవస్ధను రూపకల్పన చేసిన దేశం మనదే’ అన్నారు. స్వధర్మాన్ని అనుసరించడం మేలు చేస్తుంది. తమ తమ స్వభావాలకు, స్వధర్మాలకు సరిపోలని వృత్తి వ్యవహారాలతో తలమునకలై చాలామంది చేతులు కాల్చుకుంటున్నారు. ఈ గ్రంథంలో వేదాలు, ధర్మశాస్త్రాలు, ఉపనిషత్తులు, 5000 ఏళ్ళ క్రితం నుంచి భారత దేశ విశేషాలు, శాస్త్రవేత్తలు, మంత్రాలు, పునర్జ న్మలు, విశ్వాంతరాళం, సృష్టి వివరాలు, మానవ జన్మ, క్రమశిక్షణతో పెంచుట, క్రమశిక్షణ ఏర్పరచుకునే విధానాలు ఆధారాలతో తెలుపబడినవి. ఇది చదివినవారు మానసికంగాను, జీవితంలోని విలువలు పెంచుకొని లాభపడతారని ఆశిస్తున్నాను. | Top |
Click here to buy eBook.
| జీవన వైవిధ్యంఏడు పదుల పై బడిన రచయిత తన జీవితానుభవాలను కన్నవి - విన్నవి ఆకళింపు చేసుకొని రసగుళికలుగా మలచిన పుస్తకం ఈ జీవన వైవిధ్యం. ఇందులో 75 అంశాలపై వ్యాసాలున్నాయి. హిందూత్వంపై , ఆధ్యాత్మికతపై నమ్మకంతో వాటికి సంబంధించిన వ్యాసాలు న్నాయి. పెంపక లోపాలు - భారతంలోని పాత్రలు, నేటి అమ్మపాత్ర, ఎన్నారై భర్తలు, జీవిత భాగస్వామి ఎంపిక - నేటితరం, కుంగుబాటు (డిప్రెషన్), వృద్ధాప్యం, కాలం విలువ, ఆహార విహారాలు, మార్పు అవసరం వంటి వ్యాసాలు, పాఠకులకు కనువిప్పు కలిగిస్తాయి. అత్తా కోడళ్ళ అన్యోన్యత పెంచుకునే మార్గం, భార్యా భర్తల బంధానికి నమ్మకమని, మరి కొన్ని మంచి విషయాలు ఇందులో ఉన్నాయి. మన భారతీయ సమాజంలో ఈ సంసార బంధమే విశిష్టమని, విదేశేయులు కొనియాడుతున్నారు. డబ్బు వ్యామోహం, విదేశీ వ్యామోహాలలో చిక్కుకొని ఎన్నారై మొగుళ్ళతో బాధలు పడే స్త్రీలకు కనువిప్పు కలుగుతుంది. ఆదర్శ స్త్రీ మూర్తులు, అంగవైకల్యంతో ప్రపంచ పసిద్ధికెక్కిన వారి గురించి వివరాలు బాగున్నాయి. ఎక్కువగా వృద్ధాప్యం గురించి వ్రాయ బడిరది. వయోవృద్ధులు తప్పక చదవాల్సిన పుస్తకం. వారి ఆహార అలవాట్లలో, మనస్తత్వంలో రావలసిన మార్పుల్ని వివరణ వుంది. ఇందులో వాస్తవ జీవితాల కథనం!జరిగిన సంఘటనలే ఈ పుస్తకానికి ఆధారాలు. ప్రతి పుటలోను మహా నీయుల సూక్తులున్నాయి. ‘‘ఆకులు తిన్న మేకలు కొండలెక్కును, ఆ మేకను తిన్న మనిషి మంచమెక్కును’’ వంటి సామెతలు గుణపాఠాలు చెబుతాయి. | Top | Click here to buy eBook.
| సృష్టి-జనజీవన దర్పణం విశ్వం ఆవిర్భావం నుండి జన జీవన పరిణామం శక్తి మేరకు సవివరంగా వివరించదలచాను. ఈ పుస్తకం చదివిన వారికి తృప్తి, సంతోషం కలిగేటట్లు చాలా విషయాలు లోతుగా పరిశీలించి వ్రాయడం జరిగింది. ఇందులో సృష్టి కాలము, విశ్వాంతరాళం పుట్టుక, విజ్ఞాన శాస్త్ర ప్రకారము, వేద పురాణాలు ఏమి చెప్పాయి. సృష్టిలోని శక్తులు, యుగాంతం, మానవ పరిణామ దశలు, వివిధ సంస్కృతులు, మతము, వాటి ఆధార గ్రంథాలు, ప్రవక్తలు, వారి కాలము , బోధనలు, పంచభూతాలు, వాటితో స్థూల శరీరం, తన్మాత్రల నుండి ఇంద్రియములు ఏర్పడిన విధములు, ఆయా మతాల తత్వము, వివిధ మతాల ఆచార వ్యవహారములు, ప్రార్థనలు, పండుగలు మొదలగునవి, ఈ గ్రంథం ముగింపులో మతము ఏదైనా దైవము మీద విశ్వాసము పెంచుకుని, మానవత్వ విలువలు తెలుసుకొని, దైవత్వాన్ని పెంచుకుని, దైవ సన్నిధి చేరడమే ద్యేయము కాబట్టి విశ్వప్రేమ, కర్మ సిద్ధాంతం, యుగ ధర్మం, దాన మహిమ గూర్చి తెలుపడం జరిగింది. అదిగాక ముక్తి పదానికి యోగసాధనా మార్గం, వాటి పరిణామాలు గురించి తెలుపడం జరిగింది. అజ్ఞాని ఆలోచనకు ఉదా: చీకటి పడగానే మినుగురు పురుగులు మినుకు, మినుకు మెరుస్తూ కనిపిస్తూ , అవి ప్రపంచానికి వెలగునిస్తున్నాయి అనుకుంటాయి. కొంతసేపటికి నక్షత్రములు వెలుస్తాయి. మినుగురు పురుగులు వెలవెల పోతాయి. నక్షత్రాలు అందరికీ వెలుగునిస్తున్నాయనుకుంటాయి. చంద్రుడు ఉదయించేటప్పటికి నక్షత్రాలు వెలవెలపోతాయి. ఉదయం సూర్యుడు ఉదయించేటప్పటికి చంద్రుడు వెలవెలపోతాడు. సృష్టిలో దైవం తప్ప ఎవ్వరూ గొప్పవారు కాదు. అహంకారము, స్వార్దచింతన వదలి వారి వారి బాధ్యతలు నెరవేరుస్తూ, సృష్టిలో ఏదీ శాశ్వతం కాదని తెలుసుకుని జ్ఞాన సంపన్నులయి ప్రశాంత జీవితం గడపాలి. ఈ గ్రంథము చదివినవారికి జ్ఞానార్జనతో పాటు, మత సామరస్యము, విశ్వమానవ ప్రేమ, మానవ విలువలు అర్దం చేసుకుని మానవులంతా సమానమే అని అర్దం చేసుకుని అవసరమైనప్పుడు వారికి సహాయము సహకారములు అందించి దైవానుగ్రహం పొందగలరని ఆశించుచున్నాను. | Top | Click here to buy eBook.
| పిల్లల పెంపక విజ్ఞానం - పెద్దల బాధ్యతపిల్లల్ని నిజాయితీపరులుగా తయారు చేయడమే విద్య ముఖ్య ఉద్ధేశ్యము - జాన్ రస్కిన్. ప్రపంచములో ఎవరికైనా తన ‘‘ సంతానమే గొప్ప పెట్టుబడి’’ అంటారు. కాబట్టి తమ పిల్లలను ప్రేమ, ఆప్యాయత, శ్రద్ధతో చూసుకున్నప్పుడు మన పెట్టుబడికి సరైన విలువ, ఫలితం ఉంటుంది. స్వార్దంతో మన పెట్టుబడే కదా అని మన కోర్కెలు తీర్చుకోవడానికి, డబ్బు సంపాదించడానికి ఒక ఆయుధంగా మారిస్తే, భవిష్యత్తులో ఆ ఆయుధమే కంటకంగా మారి తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టడమే కాకుండా, సమాజానికి కూడా పనికి రాకుండా పోతుంది. మనిషి వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడానికి బాల్యదశ చాలా కీలకమైనది. బాల్యంలో ప్రతి ఒక్కరూ మేధావి అయ్యే సామర్థ్యం కలవారే. కానీ నిజమైన పెరుగుదల యదార్థంగా వారిని పెంచే తీరుపై ఆధారపడుతుంది. మనస్సు హృదయాంతరాళంలో సూక్ష్మమైన పొరలలో నమ్మకాలతో, తెలివైన ఆకారంతో దాగి వుంటుంది. వ్యక్తిత్వాన్ని వృద్ధి చేయడానికి సున్నితమైన పొరలలోనికి చొచ్చుకు పోవడానికి అంతే సున్నితమైన పదార్దం అవసరం. అటువంటి సున్నిత పదార్దం ప్రపంచంలో ఉన్నది ‘ప్రేమ ’ ఒకటే. చాలా శక్తివంతమైనది పిల్లలలో ఆలోచనలు క్రమబద్దీకరించడానికి గొప్ప ఆయుధం. ప్రతి జీవి అర్దం చేసుకునేది, అనుభవించగలిగేది ప్రేమే. వారికి అవసరమైనది ఇచ్చి పోషించేది ప్రేమ కాదు. ఓర్పుతో అనునయిస్తూ పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దే విధంగా చర్యలు తీసుకోవడమే నిజమైన ప్రేమ. పిల్లల సర్వతోముఖ వికాసానికి తోడ్పడే రీతిలో, తల్లిదండ్రులు తమ ప్రేమానురాగాలను సృజనాత్మకంగా, శక్తివంతంగా ఎలా వెల్లడిరచాలో, పిల్లల మనోభావాలను ప్రయోజనకరమైన రీతిలో ఎలా ప్రభావితం చేయాలో, పిల్లల చదువులో, పరీక్షలలో బాగా రాణించడానికి ఎలా తోడ్పడాలో, తాము ఆశించిన రీతిలో పిల్లలను ఉన్నతంగా ఎలా తీర్చి దిద్దాలో జీవితానుభవంతోను, శాస్త్రోక్తంగాను, తల్లిదండ్రులకు ఉపయోగపడే విధంగా పద్ధతులను ఈ పుస్తకంలో వివరించడం జరిగింది. మానవ పురోగమనమునకు చదువు ఒక్కటే ముఖ్యం కాదు. చదువ లేకుండా ప్రపంచ స్ధాయికి ఎదిగి ఎంతో మంది ఋజువు చేశారు. వ్యక్తి అభివృద్ధికి నిత్య కృషి, ఆత్మ విశ్వాసం, ధ్యేయం, దృఢ సంకల్పం, మానవత్వం, ప్రేమ, దయ, సత్యం, ధర్మం తోడ్పడతాయి. పిల్లలకు ఇటువంటి లక్షణాలు అలవడేటట్లు పెంచవలెను. ఇటువంటి వారు బాధ్యతాయుతమైన సంపూర్ణ వ్యక్తిగా ఎదిగి జీవితాన్ని సుఖమయం చేసుకుంటూ సమాజానికి , వ్యక్తులకు దేశానికి తోడ్పడే మంచి పౌరులుగా తయారువుతారు. | Top | Click here to buy eBook.
| ART OF BRINGING UP CHILDREN RESPONSIBLITY OF ELDERS Main purpose of education is to make children to develop integrity in Children - Jhon Raskin. Any on in this world may say that " Children are the best investment". If only the elders look after their children with love, affection and care they can reap proper value and benefits on the other hand, if we turn the child into a tool to satisfy our whims and fancies or just to earn money, then that same tool will become thorn in the flesh and it not only troubles the parents but also becomes useless for the society. The period of child hood is the most important phase in the development of an individual's personality. Every child has the ability in childhood to grow in to an intellectual. But the child's true growth depends mainly on the manner the child is brought up. The mind of man lies hidden cleverly in the deeper depths of his being behind the tender layers in order to develop man's individuality, an equally tender agent required. There only one such tender substance available in the world for this job, it is LOVE. It is very powerful agent which regulates the thinking process of a child. It is a very powerful agent which understand and experiences. Merely providing the necessities of life for children for their growth deos not come under love. True love rests in taking measures to mould their future with patience according to their needs. If parents catch the spirit of the methods suggested here in with a broad mind, love and patience, they can derive good results. What is meant by catching the spirit? We frequently say that children should always speak the truth. But when it comes to implementing it in practice in real life, we realize that the statement demands determination, patience, ability and sacrifice on the part of those who try to follow it in life. It has been proved that education is not the only important mode for the development of man. Persons like Bill Gates and Dheerbai Ambani did not even complete their high school studies. But they could dictate the world. Persistent hard work, self-confidence, a strong will, humanity, love, truth and justice help in acheiving the desired aim in life. Parent should bring - up children inculcating in them the above qualities. Such children grow into responsible minded ideal citizens possessing the qualities of all-round development. They make their lives happy and help the society and the country. | Top | Click here to buy eBook.
| చార్‌ధామ్ యాత్ర - జలప్రళయ బీభత్సం మంచిని గ్రహించటానికి మానవులల్లో చూసి నేర్చుకునే వారు కొందరు, చెబితే నేర్చుకొనే వారు కొందరు, విపత్కర పరిస్థితుల్లో, విధిలేక గత జీవిత అనుభవాలు తల్చుకొని, మంచిని గ్రహించలేక పోయినందుకు బాధపడుతూ మంచిగా మారేవాళ్లు కొందరు. ఇటీవల చార్‌ధామ్‌లో జరిగిన ప్రళయంలో కొందరు బ్రతుకు భయంతో కొట్టుమిట్టాడుతూ వరదల్లో కొట్టుకుపోఅయూరు. బ్రతుకు భయంతో బ్రతకాలనీ పోరాడి తిండీ, నీళ్ళు లేక కొందరు వాతావరణ పరిస్థితికి తట్టుకోలేక, కొందరు రాళ్ళు దొర్లి పడి, వర్షంలో జారి లోయలో పడి కొందరు చనిపోయారు. ఇన్ని అవస్ధలు పడి బ్రతికిన వారు మాత్రం మానవ జీవిత విలువలు తెలుసుకొని, ముందు జీవితం ఏ విలువలలో బ్రతకాలో నిర్ణయించుకొని ఉంటారు. మనిషి ఆఖరి దశలో ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో ఒక ఉదాహరణ : గౌతమ బుద్ధుని కాలంలో ఒక గ్రామంలో ఒక తల్లి కొడుకు ఉండేవారు. ఆమె కుమారుడు ఏ పనీ చేసేవాడు కాదు. తల్లి వండి పెడితే తిని ఊరంతా బలాదూరు తిరిగేవాడు. కొడుకు ప్రయోజకుడు కాలేదనే బాధ ఉండేది. ఒకసారి గౌతమ బుద్ధుని వద్దకు తీసుకెళ్ళాలని నిర్ణయించుకుంది. కొడుకుకు ఈ విషయం ప్రతి రోజూ చెప్పి రమ్మని పిలిచేది. వెళ్ళేవాడు కాదు. ఒక రోజు అమ్మ చెప్పినట్లు బుద్ధుని వద్దకు వెళ్ళి వచ్చేస్తే, తరువాత రోజూ అమ్మతో గొడవ వుండదని నిర్ణయించుకున్నాడు. తన అమ్మతో కలిసి బుద్ధుని దగ్గరకు వెళ్ళాడు. ఆమె బుద్ధునికి పాదాభివందనం చేసింది. కొడుకుకు ఎంత చెప్పినా బుద్ధుని వద్దకు వచ్చి నమస్కరించలేదు. అప్పుడు ఆమె నా కొడుకుకు బుద్ధి వచ్చేట్లు చేయమని బ్రతిమలాడిరది. అప్పుడు గౌతమ బుద్ధుడు వారి వద్దకు వచ్చి ఇప్పుడు ఏమి బుద్ది చెబుతాను, నీ కుమారుడు వారం రోజుల్లో చనిపోతాడు అని చెప్పి వెళ్ళి పోయారు. అప్పుడు తన కుమారుడితో చావు భయంతో ఇల్లు చేరుకుంటారు. తల్లీ కొడుకు ఒకరినొకరు పట్టుకుని ఏడ్చుకుంటారు. తర్వాత తమ బంధువులు, స్నేహితులతో ఇల్ల్లు నిండి పోయింది. ఏడ్చేవారూ, ఓదార్చేవారు అతనికి ప్రియమైన వంటలు చేసి పెట్టేవారూ. . . ఈ విధంగా ఇల్లంతా సందడిగా ఉంది. ఆఖరి రోజు వచ్చింది. ఇంక ఇరవై నాలుగు గంటలు మిగిలింది. అప్పుడు... నేను మా అమ్మ చెప్పిన మాట విని నడుచుకుని ఉంటే బాగుండేది. ఇంతవరకు ఒక్క మంచి పని కూడా చేయలేక పోయాను. అందరినీ బాధలకు గురి చేశవాను. ఇంకా పరిపరి విధాల మంచి ఆలోచనలు చేస్తున్నాడు. ఇక రెండు గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. అప్పుడు గౌతమబుద్ధుడు వారింటి ముందుకు వచ్చి నిలబడ్డాడు. అప్పుడు ఆ తల్లి కొడుకు, అక్కడున్న ఇతరులు వచ్చి బుద్ధుని ముందుకు వచ్చి నిలిచారు. . . ఈ 24 గంటలు నీవు ఎవరికైనా చెడ్డ చేశావా? చెడ్డ తలిచావా? అని ఆమె కొడుకును అడిగాడు. అతను లేదు అన్నాడు. నీవు గత 24 గంటల్లో ఏమి ఆలోచించావోరa ఆ విషయాన్ని నేను 24 సంవత్సరముల నుంచి ఆలోచిస్తున్నాను అని చెప్పి ఇక మీదట మంచిగా బ్రతుకు అని చెప్పి. . . నీవు ఎప్పుడు చనిపోయేదీ నాకు తెలియదు అని చెప్పి వెళ్ళిపోయాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ జీవిత ఆఖరిదశలో కాకుండా స్వార్థము, అసూయ వదలి ఇప్పటి నుంచే ఆలోచన చేసి మంచిని అమలు చేయుట మంచిది. ఈ పుస్తకం చదివిన వారు ఆలోచన చేస్తారని నమ్ముచున్నాను. | Top | Click here to buy eBook.
| A promising career in engineering beckoned me pretty early in life. I had just completed my school education. My credentials to write this technical book have more to do with the hands-on experience gained from over 50 years of working in some prestigious engineering companies than with the knowledge acquired from academic institutions. After a brief stint in Government employment, I found it was not my cup of tea and so I joined an EHT transmission line engineering and construction company. Impressed by my performance, the company sent me as site in-charge wherever I was assigned. I learnt soon that I would end up just controlling labour, supervising payments and accounting the material, if I did not acquire sound technical knowledge of the work responsibilities. On an occasion, we had completed construction of a 15 mw power house and were to finalise and submit material accounting to the AP State Electricity Board before we could hand over the site to them. The responsibility fell on me as the regular technical site in-charge was deputed elsewhere. I was barely 23 and hot-blooded. I used to be blunt to the point of being rude. So, I had few friends or well-wishers who could help me. I changed my ways, won them back and finalised the account. My efforts to complete a diploma course through distance education did not succeed because of the hectic work schedule lasting up to 16 hours a day. I did not stop reading technical literature on the subject to upgrade and update my knowledge. I achieved the capacity to independently handle an EHT transmission line project on my own and thus earned a place in the management cadre of M/s EMC Steelal Ltd, Kolkatta. A comprehensive report on the training I underwent in this company was much appreciated. I had also successfully handled the assignment entrusted by Mr. Arora, general manager (foreign projects), to do a project report for laying 100-km , 220KV line passing through hilly region, paddy fields and patches of dry land. I was immediately assigned to take up stringing of 360 km of 400 KV line from Bhilai to Kuradi. Barely two months later, I was sent post haste to Dubai, where the company ran into trouble on account of labour strike. I completed two projects there on time. Initially, the Dubai Electricity Company did not accept me as a field engineer as it had serious reservations about my technical competence. They accepted me as site engineer only after the DEC and the British consultants M/ Kennedy & Dankin, observed my performance for 3 months and were satisfied. The EMC firm promoted me and asked me to do a project in Libya. I chose to quit and take up UHT line work on my own. Technical knowledge and skill in line survey and conductor stringing works are crucial to EHT transmission line construction works. In later years, I focused on survey work as it formed the backbone of any UHT project. It is not easy to work abroad or with foreign consultants unless we measure up to their exacting expectations in technical skills. I had worked with the British, Finnish, German, Italian and American consultants in India and abroad. I had worked for the NTPC, the Power Grid Corporation, the State Electricity Boards and the MNCs in India. I have striven hard to present in this book, material I gathered over the past half century in UHT lines field operations. I have also tried to update the subject matter and cover major trends and developments in the UHT transmission projects. I sincerely hope that this book will be of immense value and utility to practising engineers in the field of UHT transmission projects. Kekalathur Krishnaiah | Top | Click here to buy eBook.
| ఓ మహిళా తిరగబడు... చూపించు తెగువ శ్రీ కేకలతూరి క్రిష్ణయ్య రచించిన ఈ గ్రంథం చదివాను. తల్లి పాదాల క్రింద స్వర్గం వుందని ఇస్లాం ధర్మం చెబుతోంది. ఒక మహిళను కాపాడిన వ్యక్తి స్వర్గానికి వెళతాడు. హింసించిన వ్యక్తి స్వర్గాన్ని చేజార్చుకుంటాడు. మహిళలను కాపాడే అవకాశం ఇటు పోలీసులకు, అటు రచయితలకు అధికంగా వుంటుందని నా ఉద్దేశం. రచయిత మహిళల పట్ల ప్రదర్శించిన సానుభూతి, ధైర్య వచనాలు, తన పుస్తకం ద్వారా మహిళలను కాపాడాలనే ఒక బలమైన ఆకాంక్ష, మహిళలకు చేతనైనంత సహాయ సహకారాలు అందించాలనే తపన, దృక్పథం, శోధన చక్కగా ఉన్నాయి. సమాజంలో మహిళలకు వ్యతిరేకంగా జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, అఘాయిత్యాలు, అరాచకాలను, సమాజంలోని పోకడలను చాలా క్షుణ్ణంగా గమనించి, పరిశీలించి, పరిశోధించి ఈ పుస్తకం రాశారని అర్థం అవుతుంది. పరిష్కారాలు కూడా చూపించారు. - శ్రీ ఎ.కె.ఖాన్ ఐ.పి.ఎస్, ఏసిబి డైరక్టర్ జనరల్ * * * ఇది చాలా సాధికారిక రచన. ప్రపంచాన్ని పరిశోధించి, పరిశీలించి స్త్రీ పరిస్థితిని కళ్ళకు కట్టిన రచన. ఇటీవల స్త్రీల మీద దాడులు ఎక్కువయ్యాయి. నిర్భయ చట్టం వచ్చింది. వాటి గురించి వివరణ ఇచ్చారు. క్రమంగా స్త్రీలు ప్రపంచంలో, వివిధ రంగాల్లో ఎట్లా రాణించారో వివరించారు. స్త్రీలపై జరుగుతున్న దాడులకు ఎట్లాంటి సామాజిక, ఆర్థిక, మానసిక పరిస్థితులు దేశంలో వున్నాయో చూపారు. వీటన్నిటిని అధిగమించి స్త్రీ ధైర్యంగా, నిలబడడానికి ఎట్లాంటి చర్యలు అవసరమో సచిత్రంగా వివరించారు. - శ్రీ తనికెళ్ళ భరణి, రచయిత, సినీ కళాకారులు |
Top |
Click here to buy eBook.
| O Woman! Arise and Fight In India, though the crime is proved, no one talks about the punishment for years together. As a result of this habit the offenders feel that nothing happens even if the crime is committed. This lethargy makes it difficult to control crimes. If this situation should change, there should be changes made in the very establishments. Efforts should be made to erase the differences between men and women that are observed in the society. Children should be taught to develop a humanitarian outlook through an education that stresses on values. The movies that show women as show things should be banned as also such literature. The free for all that is taking place in the internet should be stopped. Liquor and drugs should be controlled. Rapes and atrocities cannot be stopped or controlled without taking severe action on the above items. Rape offenders should immediately be punished most severely. Then only Nirbhayas will get protection. 25 November is the day of International Anti-violence Day for Women. In that connection I wanted to write a book dealing with the Acts that come to their help, the precautions women should take to protect themselves and allied aspects. - Kekalathur Krishnaiah
Sri K.Krishnaiah's latest book is a timely necessity. People talk but seldom act. The writer has his pen as this weapon. But the pen does not hurt or harm in the hands of a seasoned thinker like Sri Krishnaiah. It acts as an instrument of encouragement, an eye-opener and as a guiding agent. Cultural societies in the world have been trying to curb the evil tendency in man by passing Acts and punishing him severely for his attacks on women. This book by Sri Krishnaiah is an attempt to help women to safeguard themselves when man behaves forgetting his birth as a human being. Women need not wince at the superior strength of man. They should develop a strong will to face him. Krishnamaiah's book comes out of the heart of the author. It also reflects the thinking of the wise at the half-hearted manner the authorities handle the problem and its solution. Justice delayed is justice denied. It is not for nothing that Sri Krishnaiah has been called the "Samajika Rachana Silpi". - D. Ranga Rao
| Top |
Click here to buy eBook.
| యువతా... కాపాడుకో నీ భవిత దేశాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి విడుదలైన మొత్తాలు రాజకీయ నాయకులు, వారి అనుచరులు, వారికి సహాయం చేసే ప్రభుత్వోద్యోగులు ఆ డబ్బు దారి మళ్ళించి వీరి బొక్కసాలు నింపుకుంటున్నారు. బడుగుజీవుల బతుకుల్లో మార్పులేదు. ఎన్నికలొచ్చినప్పుడు అమాయక ప్రజలకు డబ్బు ఆశ చూపి ఓట్లు కొనుక్కొంటున్నారు. ప్రజాస్వామ్య విలువలు అడుగంటిపోయాయి. ఏదో కొంత మంది నిజాయితీపరులైన నాయకులు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నా వారు చేయగలిగింది పరిమితంగానే ఉంటుంది. డిల్లీ పీఠం మీద, రాష్ట్రాధిపత్యంలోను నిజాయితీ నాయకుడున్నా ఈ అవినీతి ప్రక్షాళన చేయలేరు.
ఈ అవినీతి అంటువ్యాధిలా ప్రబలింది. దీని మూలాలు తెలుసుకొని అంతమొందించాలంటే మంచి వైద్యుల బృందాలు దేశమంతా ఏర్పడాలి, ముఖ్యంగా గ్రామాల్లో ఏర్పడి ప్రబలిన అవినీతి జాడ్యాన్ని నిర్మూలించాలి. ఆ వైద్యులే యువత. బృందాలుగా ఏర్పడి అమాయక ప్రజలకు, బడుగు జీవులకు అండగా నిలిచి వారి వారి గ్రామాలు వారే బాగు చేసుకోవాలి. సరైన నాయకత్వం లేక ప్రజలు దిక్కుతెలియని స్థితిలో ఉన్నారు. మంచి నాయకత్వానికి తోడుగా ప్రజలు ముందుకొస్తారు. వ్యవసాయం, విద్య, వైద్యం, పొదుపు, గ్రామాభివృద్ధి, రవాణా, నీరు మొదలగునవన్నీ ప్రజలకు సేవ చేయవచ్చును. మనది వేద భూమి, ఆధ్యాత్మికత, సత్యం, ధర్మం, పునాదులుగా మన దేశం, మన సంస్కృతి వెలసింది. కాబట్టి పల్లె పట్టణం అని లేకుండా అన్ని చోట్లా మానవత్వం విలువలు తెలిసిన మహానుభావులున్నారు.ఇప్పటి వరకు కాపాడుతూ వచ్చారు. మానవతా విలువలతో, సేవాభావంతో, నిస్వార్ధబుద్ధితో, స్వచ్ఛమైన మనస్సుతో సమాజమునకు ఎనలేని సేవలు చేసి, దేశాభివృద్ధికి తోడ్పడిన దేశ విదేశాలలోని పదిహేను మంది యధార్ధ గాధలు ఈ పుస్తకంలో పొందుపరిచాను. ఈ పుస్తకం చదివి యువత, దేశభక్తి, సేవాభావంతో స్ఫూర్తిదాయకంగా కొంతమందైన ముందుకు వస్తారని ఆశిస్తున్నాను. - కేకలతూరి కృష్ణయ్య
| Top |
Click here to buy eBook.
| A Guide to EHT SubStations The book covers various major equipment details required for construction of EHV Sub-Stations. He has written this book based on his field experience in construction of EHV Sub - Stations. He has good experience in the construction activity in India and abroad and has illustrated standard practices required for construction and safe operation of them. The Power Generation and Transmission is major part of supplying electrical energy to the public for their day to day requirements in Industries, commercial establishments and in domestic use. The safety precautions and operational requirements are given in detail by Sri K. Krishnaiah in this book. This book is very useful for field engineers working in construction organizations in their day to day works and for their improvement in associating with various operations of the equipments in the EHV Stations. I appreciate the work done by Sri. Sri K. Krishnaiah in bringing this book indicating his rich experience in EHV Sub-Stations. - Mr. Gopalachary, Former Director, APTRANSCO
It gives me immense pleasure to write about this book titled “A Guide to EHT Sub - Stations” written by Sri K.KRISHNAIAH. After going through his previous book on survey and transmission line construction, I could understand the rich and vast experience of the author in the field of Electrical Engineering. He has dealt in detail, various aspects of power system in an 'easy to understand' style, through illustrations. Each chapter is dealt in such a way to cover all topics. Especially the chapters on protection and cables are covered with the latest topics. The technical knowledge embedded in this book reflects the vast experience of the author and is useful as a guide to all fresh as well as practising engineers. I congratulate the author for his zeal and painstaking efforts in bringing out this book and wish him all the best for his future works. - Mr. Vijayakumar, SE, TSTRANSCO
| Top |
Click here to buy eBook.
| మాతృభాష తెలుగుకు వెలుగు చూపు నిత్య సత్య పరిశీలకులు, విషయ సుస్పష్టవ్యక్త నిపుణ శిల్పి శ్రీ కేకలతూరి కృష్ణయ్య గారు రచించిన పదిహేడునూ పరిశోధనా గ్రంథములే. అవి విభిన్న విపుల విషయ సిరులు. విశిష్ట విషయ సంగ్రహణా నిధులు. విశ్వజన ప్రయోజనకరములు. సందేశాత్మకములు. ప్రౌఢభావోన్నతములు. ఇట్టి సమాజ హితవరి రచించిన ఈ గ్రంథము సామాన్యులకు పండితులకు భాష, మాతృభాష తెలుగు భాషల పట్ల చక్కని అవగాహన గల్గించును. మానవ మనుగడ కత్యంతావశ్యకమగు భష లెప్పుడెక్కడెట్లు పుట్టెనో, వ్యాపించెనో తెల్పును. ఐత్రేయారణ్యకయజుర్వేద సూక్తములను, సాన్, పపువాన్, టిబెటో బర్మన్, ఆస్ట్రో ఆసియాటిక్ ఇండో యూరోపియన్ మొదలగు భాషల చరిత్రను తెలుపును. సంస్కృతిని వివరించును. వ్యాప్తి నెఱిగించును. మానవుని సర్వతోముఖాభివృద్ధికి మాతృభాష దోహదపడు విధమును ప్రపంచమున మాతృభాషాభివృద్ధి దేశములలో పెరిగిన విజ్ఞాన, శాస్త్ర సాంకేతిక నైపుణ్యము. తద్వారా ఆయా దేశముల సాంఘిక, ఆర్ధిక యశోప్రగతులను సోదాహరణముగా యిందు తెలుపబడినది అని పఠితుల హృదయమున మాతృభాషాభిమాన బీజములను విత్తును. తెలుగు భాష పుట్టుపూర్వోత్తరములు, ఎవ్వరూ గతములో చెప్పని రీతిలో రచయిత ఈ గ్రంధమున వినూత్నముగ తెలిపెను. అచ్చులు, హల్లులు వ్యాకరణాంశములు, జరిగిన మార్పులు క్రమపద్ధతిలో తెల్పెను. రాజులు, శాసనములు, పురాణములు, కావ్యాలు, ప్రబంధాలు, నాటకాలు, గేయములు, పదకవీతలు వివిధ సాహిత్య ప్రక్రియలలో భాష వృద్ధి చెందిన వైనము. వానిని సృష్టించిన కవులు, పండితులు కళాకారులు వానిని పోషించిన రాజులతో విశదపరిచెను. కార్పొరేట్ విద్యా వ్యాపార సంస్థల విష ప్రచారముతో ఆంగ్లభాషా వ్యామోహములో తచ్చాడు తెలుగు భాష జ్యోతి వెలుగుల సుగతులనేర్పాటు చేసిన రచయిత తెలుగు భాష వైభవమును విదేశీయ మహాత్ములు, పొరుగు రాష్ట్రాల మాన్యులు, మన రాష్ట్ర పండితులు ప్రశసించిన విధము, భాష గొప్పదనమును భాష ప్రజలను భాష సంస్కృతిని, ప్రపంచ విస్తరణను, విదేశ విశ్వవిద్యాలయ భోధన శాఖలను పీఠములను స్పష్టపరచెను. ఇట్టి భాషాభివృద్ధికై ప్రభుత్వము పాటుపడవలెనని వీరి సూచించిన సూచనలు మిక్కిలి ప్రాధాన్యతను సంతరించుకొన్నది. - మహాకవి విద్వాన్ చలంకోట బురుజు మునుస్వామి
|
Top |
Click here to buy eBook.
| మానవులు - మనస్తత్వాలు నేను ఆరాధించే సరస్వతి మీద ప్రమాణం చేసి చెపుతున్నాను. ఇది చాలా అద్భుతమైన పుస్తకం. డెబ్భై ఎనిమిదేళ్ళ వయసులో క్రిష్ణయ్య గారు ఎంతో కృషి చేసి యువతకు అందించిన ఈ వ్యక్తిత్వ గ్రంథం చాలా వ్యక్తిత్వ వికాస పుస్తకాల కంటే ఎంతో ఉన్నతమైనది. ఇందులో ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలూ, ఇచ్చిన ఉదాహరణలూ చాలా గొప్పగా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ చదవవలసిన పుస్తకం ఇది. ఇలాంటి కితాబు నేను గతంలో ఏ పుస్తకానికి ఇవ్వలేదు అని నా పాఠకులకి తెలిసే ఉంటుంది. ఇంత జ్ఞానం ఉండి, అనుభవం ఉండి, కృష్ణయ్య గారు పాఠకలోకానికి అంత పాపులర్ రచయిత కాలేకపోవడానికి కారణం ఆయనకి మార్కెటింగ్ గిమ్మిక్స్ తెలియకపోవడమే అని నేను భావిస్తున్నాను. ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరు కొని చదివి, వీలైనంతమందికి రికమెండ్ చేయాలని నా అభిలాష. - యండమూరి వీరేంద్రనాథ్
* * * "మానవులు - మనస్తత్వాలు" పుస్తకం పూర్తిగా చదివిన తరువాత ఒక వ్యక్తి తన అనుభవమును ఇతరులకు పంచాలనే దూరదృష్టి, సామాజిక దృష్టి, విషయాన్ని తేలికగా కథన రూపంలో అందజేసే నైపుణ్యత చక్కగా ఉన్నది. ఒక వ్యక్తి అనుభవాన్ని ఆధారంగా తీసుకొని సమాజంలో నిత్య జీవితంలో వాస్తవంగా ఎదుర్కొన్న సమస్యలు - పరిష్కారమార్గాలు, సాధించిన లక్ష్యాలు, పాఠకులకు మంచి ఉత్తేజాన్ని, సృజనాత్మకతను అందివ్వగలనని ఇందులోని పాత్రల ద్వారా నిరూపించారు. శంకరయ్య విద్యార్థి జీవనం, పాఠశాల వాతావరణం, ఆనాటి విద్యా విధానం నేటి తరానికి మార్గదర్శకం. కుటుంబంలో జరిగే సమస్యలు, తద్వారా అన్నీ పొందిన వెలితిగా కలిగిన మానసిక అసంతృప్తి ప్రతి కుటుంబంలోను కనిపిస్తుంది. పలు కథల ద్వారా విషయ అవగాహన చక్కగా వ్యక్తపరిచారు. ఆ కథలు మంచి నైతిక విలువలు, మానవ సంబంధాలు, చక్కగా అవగాహన కల్గిస్తాయి. నీతిని పెంపొందిస్తాయి. ఈ పుస్తకం మనో విజ్ఞానానికి సంబంధించినది కానీ శాస్త్రాన్ని మాత్రమే కుమ్మరించకుండా ఉదాహరణల ద్వారా చక్కగా అందించారు. పాఠకులకు అవగాహన కలిగిస్తుంది. పలు జీవితానుభవాలు ప్రతి కుటుంబ జీవనానికి ఉపకరిస్తాయి. కుటుంబ సహజీవనానికి, లౌక్యంగా, హాయిగా సమాజంలో మెలగడానికి తోడ్పడతాయి. ఈ పుస్తకం సమీక్షకు పంపినందుకు కృతజ్ఞతలు. నాకున్న ఉపాధ్యాయ నేపథ్యం ద్వారా ఈ చిన్న అభిప్రాయం వ్యక్తపరిచాను. ‘‘చదువుకున్న డిగ్రీకన్నా అనుభవం గొప్పది. అందుకు ఉదాహరణ ఈ పుస్తకం’’. ఈ పుస్తకం ప్రచురించి పదుగురికి ఉపకరించి, సమతౌల్య మూర్తిమత్వ వికాసానికీ, ఉపకరించాలని తద్వారా మీ ఆశయం - లక్ష్యం నెరవేరాలని ఆకాంక్షిస్తున్నాను. - డా॥ ముత్తు యతిరాజు , ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ శిక్షణా సంస్థ (మ), రాయపేట, చెన్నయ్ - 14
|
Top |
Click here to buy eBook. | సమాజిక హితకారిణి పరమాత్మ తత్త్వమెరిగిన మహర్షులూ, పరమాణు రహస్యాలెరిగిన శాస్త్రజ్ఞులు ‘‘మానవ సేవే మాధవ సేవ’’ అని నమ్మి మానవాళి సేవకే అంకితమైన మహాత్ములు - ఎందరెందరో పుడమిపై వెలిశారు. కరుణ, ప్రేమ, త్యాగబుద్ధి లేకుంటే మనిషి రాక్షసుడౌతాడు. స్వార్థానికి అతీతమైన లక్ష్యాన్ని జీవితంలో ఎవరికి వారే ఏర్పరుచుకోవాలి. లేకుంటే బ్రతుకు తెగిన గాలిపటం అవుతుంది. గమ్యం లేని బతుకు అశాంతికి నిలయాలు. విధి చేతిలో కీలు బొమ్మలమని, వ్యక్తిత్వం లేని బ్రతుకు బ్రతకటం అర్థరహితం. కుటుంబంలో, సమాజంలో ఎవరంతట వారికి తమ పాత్ర గురించి నిర్ధిష్ట అభిప్రాయం ఉండాలి. లేకుంటే అనేక మానసిక దౌర్బల్యాలకు గురి కావలసి వస్తుంది. సంకుచిత బుద్ధి ప్రబలితే, ప్రయోజనాపేక్షతో పరిచయాలను, స్నేహాలను పెంచుకుంటూ పోతే ఎప్పటికప్పుడు అశాంతికి గురి కావలసి వస్తుంది. హత్యలు, ఆత్మహత్యలు నేడు చాలా సమస్యలకు సులువైన పరిష్కారంగా కనబడుతున్నట్లుంది. గానుగెద్దు జీవితం ఊబిలో బ్రతుకుతూ, విశాల దృష్టి పెరగని వైఫల్యం చాలా మందిని ఈ బలహీనతకు గురి చేస్తున్నాయి. మూణ్ణాళ్ళ ముచ్చట బ్రతుకు మన పాలిట మహావరం. మనం ఈ భోగభాగ్యాలతోనూ, ఇన్ని ఆధునిక వసతులతోను జీవిస్తున్నామంటే మన తాతలు ముత్తాతలు మనకోసం ఎంతో చేయబట్టే. మనము సోమరులమైతే రేపు మన పిల్లల సంగతేంటి? ముందు తరాలకు నీవు ఏమిస్తావు? చేస్తున్న వృత్తి చిత్తశుద్ధితో చేయడం, స్వంత లాభం కొంత మానుకుని పొరుగువారికి తోడు పడటం, జీవిత లక్ష్యాలు కావాలి.
|
Top |
Click here to buy eBook. | జంతువిజ్ఞానం - సృష్టి వైచిత్రం తెలిసీ... తెలియని ప్రపంచం... అద్భుతం... ఆశ్చర్యం... అపూర్వం...
కేకలతూరి క్రిష్ణయ్యగారు... ఆయన పరిశీలనా... శ్రద్ధ... మాకు తెలిసిన (తెలిసీ... తెలియని విషయాల్ని) పరిపూర్ణమైన అవగాహనతో... బొమ్మ కట్టారు. . ఎన్ని జంతువులు.. ఎన్ని పక్షులు.. ఎన్ని కీటకాలు.. ప్రతీ దానికి.. దాని మూలాలు.. అలవాట్లు వంటి అనేక విషయాల్నిఅందంగా చిత్రించారు... ఈ పుస్తకం చదువుతోంటే... డిస్కవరీ ఛానల్లో జంతువుల్ని దగ్గర్నుంచి చూస్తున్నట్టుంది.
... ఇది మామూలు సృష్టి కాదు..... తెలుగు జాతి యావత్తు... మీకు రుణపడి ఉంటుంది.. - శ్రీ తనికెళ్ళ భరణి, రచయిత, సినీ కళాకారులు
|
Top |
Click here to buy eBook. | వేద విజ్ఞానం - సృష్టి రహస్యాలు వేదం భారతీయుల ఆత్మ...., వేదం అందరికీ, అంత సులువుగా అందేది కాదు... తేలిగ్గా అర్థమయ్యేది కాదు... . అలాంటి వేద మూలాల్ని, వాటి ప్రయోజనాలన్నీ సామాన్యులకు సైతం.. అరటిపండు వొలిచి చేతిలో పెట్టారు కేకలతూరి క్రిష్ణయ్య గారు. ఇదే కాకుండా... రెండో భాగంలో సృష్టి రహస్యాలని... అందరినీ ఆకట్టుకునేలా... ఉదాహరణలతో రాశారు. క్రిష్ణయ్య గారు గతంలో కూడా చాలా పుస్తకాలు రాశారు... వయస్సు పై బడుతున్నా కూడా ఉత్సాహంగా... ఆయన చేస్తున్న ఈ రచనా వ్యాసంగం... చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది! పండితులనీ... పామరులనీ కూడా అలరించే శైలి కేకలతూరి వారిది... ఇంత పరిశోధన... పరిశీలన చేసి... ప్రపంచానికి ఇన్ని అద్భుతమైన సంగతుల్ని పరిచయం చేస్తున్న క్రిష్ణయ్య గారికి నమోవాకములు... శివోహం .. - శ్రీ తనికెళ్ళ భరణి, రచయిత, సినీ కళాకారులు
|
Top |
Click here to buy eBook. | చతుష్షష్టి కళలు
కృషితో ‘ఋషి’ స్థానాన్ని పొందిన కర్మయోగి ఫలాపేక్ష తెలియని నిస్వార్థమూర్తి, కీర్తికాంత నిరంతరం నీడలా వెన్నంటి వున్నా, వెనుతిరిగి చూడక, నమ్మిన లక్ష్యసాధనకై ముందుకు సాగిపోయే వినమ్రమూర్తి. బహుముఖ ప్రజ్ఞతో ఎదిగి ఎదిగి, అనూహ్య స్థానాన్ని అధిష్టించినా, అంతకుమించి వొదిగిపోయి, దైవత్వాన్ని నిర్వచించిన ధన్యజీవి క్రిష్ణయ్య గారు. క్రిష్ణయ్యగారికి కీర్తికండూతికి అర్థం తెలియదు. కీర్తి శిఖరాగ్రాలను గురించిన పట్టింపు లేదు. అతి నిరాడంబర తత్వానేషణతో, తద్వారా సముపార్జించిన యోగశక్తి ప్రభావం చేతనే భగవంతుని అనుగ్రహాన్ని పొంది, అంతర్యామి ఆదేశానుసారం కలం పట్టి - అసాధారణ రచనలెన్నో చేశారు, చేస్తున్నారు. ఉద్యోగరీత్యా దేశ విదేశాలో సంచరిస్తూనే, జ్ఞానతృష్ణతో, స్వయంకృషితో, తమ మార్గాన్ని నిర్దేశించుకుని, అధ్యయనం చేసి, ఆర్జించిన విశేషానుభవాలను సమాజ చైతన్యం కోసం ధారపొయ్యాలని, నిర్విరామ సాహితీ సేద్యంలో హలాన్ని కలంగా మార్చి, నిత్యకృషీవలునిగా గ్రంథరచన చేస్తున్నారు. అరుదైన ఈ గ్రంథాన్ని లిఖించి ‘‘చతుష్షష్టి కళల’’నూ సకల జన ప్రయోజనార్థం కనుల ముందుంచి, నవ్య చైతన్యాన్ని మనకందించే ప్రయత్నంలో సఫలీకృతుయ్యారు క్రిష్ణయ్యగారు. అరవై నాలుగు కళలలో పరకాయ ప్రవేశం చేసి, సహజ సిద్ధమైన ప్రజ్ఞాపాటవాలతో - కలం పట్టి ఆశించిన ప్రయోజనాన్ని సాధించిన క్రిష్ణయ్యగారు ధన్యులు. - డాక్టర్. కె. వి. కృష్ణకుమారి
* * * కళకళలాడే తత్త్వం
కేకలతూరి క్రిష్ణయ్యగారికి దణ్ణాలు పెట్టేస్తున్నా... కారణం... ఈ వయసులో... ఆయన తృష్ణ... ఆయన కృషీ... ఆయన తపనా.... నిజంగా ఈర్ష్య కలుగుతోంది!... ఎన్ని పుస్తకాలు... ఎంత విలువైన సమాచారం... ముఖ్యంగా భారతీయ జీవన విధానం గురించి అరవై నాలుగు కళలు.... అసలు అవి ఉన్నాయని ఈ జనరేషన్‌లో చాలామందికి తెలీదు లెండి!! అలాంటి 64 కళల గురించి విపులంగా వ్రాసిన పుస్తకం... మళ్ళీ చెప్తున్నా దీనిగ్గూడా పిహెచ్.డి ఇవ్వొచ్చు!
ఏమైనా క్రిష్ణయ్యగారు ధన్యులు... ఆయనతో పాటే సంచరిస్తున్న మేమూ ధన్యులం. శివోహం .. - శ్రీ తనికెళ్ళ భరణి, రచయిత, సినీ కళాకారులు
|
Top |
Click here to buy eBook. | బంధాలు - బంధుత్వాలు
'బంధాల దీప్తి' - 'బంధుత్వాలకు స్ఫూర్తి' నిస్వార్థ ప్రేమతో పూర్తి హృదయాలతో చేసే సంబంధాలు కలకాలం నిలబడి ఉంటాయని, ఉత్తమ సంస్కార పరంతా ఆదర్శవంతమైన సమాజం ఏర్పడుతుందనీ, అటువంటి సమాజమే మనిషికి ధైర్యాన్నిచ్చి ఆత్మస్థైర్యంతో నిలబడేలా చేస్తుందనీ - ప్రారంభంలో వ్రాసుకున్నారు రచయిత. మానవ సంబంధాలను గురించిన అధ్యయానాన్ని, జీవితంలో ఎలా సాధించాలో ఎంతగానో ఉపయోగపడేలా చేస్తుందీ గ్రంథం. ఆయన స్వీయానుభవాల సారాంశం కనుక క్రిష్ణయ్యగారు అంత దృఢంగా, ఆత్మవిశ్వాసంతో చెప్పగలిగారు. ఈ గ్రంథంలో మమతలతో కూడిన మానవతకి అగ్రస్థానాన్నిచ్చారు. మానవాభివృద్ధికి తోడ్పడే ఆరోగ్యం, చదువు, సంస్కృతి, ఆధ్యాత్మిక దృక్పథం, శాంతి సౌభాగ్యాలనూ అత్యున్నత స్థితిగతులనూ అందజేస్తుంది కనుక - అందుకు తగిన మార్గాలను సవివరంగా సూచించారీ గ్రంథంలో. వివాహ వ్యవస్థను గురించీ, దంపతుల మధ్యన వుండవలసిన ఆత్మీయానుబంధాల గురించీ, పట్టుదలలకు, ప్రతీకారాలకూ - ఈర్ష్య, అసూయా ద్వేషాలకు సహజీవనంలో స్థానమనేదే వుండకూడదనీ చెబుతూనే - దంపతుల మధ్యన వుండదగ్గ సుఖ జీవనానికి ఎంతో విలువైన సూచనలు అందజేశారు. సుఖమయ దాంపత్య జీవనమంటే, చక్కని అవగాహనతో, అన్యోన్యానురాగాలతో, ప్రేమాస్పద వర్తనతో సాగిపోవాలనీ; కానీ ప్రస్తుత పరిస్థితులలో ఇగో, అతిశయం, అసహనం ఎక్కువయ్యాయనీ తద్వారా బంధాలు విచ్ఛిన్నమవటమే కాకుండా పిల్లలు మానసిక వికలాంగులుగా తయారవుతున్నారని ఆవేదనను వ్యక్తం చేశారు. దంపతుల మధ్య సుహృద్భావం నెలకొనటానికీ, ప్రశాంత జీవనం కొనసాగడానికీ ఎన్నో సలహాలను మానసిక తత్వవేత్తలా అందించి తన బాధ్యతను సఫలీకృతం చేసుకున్నారు క్రిష్ణయ్యగారు. అందుకు సంబంధించిన మార్గాలనెన్నిటినో సుదీర్ఘంగా వివరించారీ గ్రంథంలో. కుటుంబ పెద్దగా ఆయన ఆచరించిన, ఆచరిస్తున్న ప్రేమ పూరితమైన బాధ్యతాయుత వర్తనను - హృద్యంగా అక్షరబద్ధం చేశారు. - డాక్టర్. కె. వి. కృష్ణకుమారి
* * * అనుబంధాల ఆంతర్యం తెలిసిన మనిషి
ఈ "బంధాలు - బంధుత్వాలు" అన్న గ్రంథంలో సమాజంలోని వ్యక్తులతో, స్నేహితులతో, పరిచితులతో, అపరిచితులతో మనకు ఏర్పడే సంబంధాల మంచి చెడుల్ని క్రిష్ణయ్యగారు వివరిస్తారు. ప్రత్యేకించి భార్యాభర్తల సంబంధాల్ని, స్త్రీ పురుషుల సంబంధాల్ని వివిధ కోణాల్లో విశ్లేషిస్తారు. మానవ జీవిత్తం క్రమశిక్షణతో వుంటే ఎంత అర్థవంతమవుతుందో చెబుతారు. 'వ్యక్తి సామాజికుడు. వ్యక్తి తన చర్యల ద్వారా సమాజానికి మేలు చేయాలి' అంటారాయన. ఆ క్రమంలో జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురయినా దృఢంగా నిలబడాలంటారు. తన రచనలన్నింటిలోనూ ఆయన మతం, కుటుంబం, మనస్తత్వం, తదితర అంశాలని విశ్లేషిస్తూ వుంటారు. మానవ ప్రయత్నంతో సమాజ కుటుంబ రుగ్నతల్ని రూపుమాపవచ్చని ఆయన శాస్త్రీయంగా తన రచనలల్ని మన ముందుంచారు. అందరం చదవాల్సిన ఆయన రచనల్లో యిది కూడా మరొకటి.
- శ్రీ తనికెళ్ళ భరణి, రచయిత, సినీ కళాకారులు
|
Top |
Click here to buy eBook. | సైన్యము - యుద్ధము - యుద్ధవీరులు
యుద్ధం ఆధిపత్య భావనకి చిహ్నం. ఏ కాలంలోనైనా యుద్ధం వినాశకరమే. వ్యక్తులుగా యుద్ధాన్ని వ్యతిరేకించినా ఒక రాజ్యంగా/ఒక దేశంగా యుద్ధంలో పాల్గొనడం కొన్నిసార్లు అనివార్యమౌతుంది. పూర్వకాలంలో వేరే రాజ్యాన్నో దేశాన్నో కబళించడానికి యుద్ధాలు జరిగితే, వర్తమానంలో వనరుల కోసం యుద్ధాలు జరుగుతున్నాయి. చరిత్ర నిండా యుద్ధాలూ... మృతులు... క్షతగాత్రుల వివరాలే అనుకుంటారు చాలామంది. ఎప్పుడో జరిగిన యుద్ధాల గురించి ఇప్పుడెందుకు తెలుసుకోవడం అనుకుంటారు మరికొందరు. నిజమే. యుద్ధం అవసరం లేదు. కాని యుద్ధాల గురించిన సమాచారం తెలుసుకోవడం అవసరం. ఏ యుద్ధం ఎందుకు జరిగిందో, ఏ ఘటన ఏ యుద్ధానికి దారితీసిందో, ఏ రణానికి ఏది పరోక్ష కారణమో, ఏది ప్రత్యక్ష కారణమో తెలుసుకోవాలి. యుద్ధమంటే మనుషులు... యుద్ధమంటే ఆయుధాలు.. యుద్ధమంటే సైన్యం... యుద్ధమంటే జయాపజయాలు. జీవనమే పోరాటంగా మారుతున్న రోజులివి. జీవనోపాధి కోసం వృత్తి నైపుణ్యం మాత్రమే కాకుండా అనేక విషయాలపై అవగాహన కలిగి ఉండడం అనివార్యమైపోతున్న కాలమిది. ముఖ్యంగా ప్రభుత్య రంగం, బ్యాంకింగ్ రంగాలలోనూ ఉద్యోగాలు ఆశించే యువతకి సామాన్య విజ్ఞానం విస్తృతంగా పెంచుకోవాల్సి ఉంది. పలు పోటీ పరీక్షలలో చరిత్రకి సంబధించిన ప్రశ్నలు అడుగుతున్నారు. చరిత్రలలో యుద్ధాలు విడదీయరాని భాగం. అందుకే యుద్ధాల గురించి విపులమైన వివరాలను ఈ పుస్తకంలో అందిస్తున్నాను. సైన్యమంటే ఏమిటి? భారత సైనిక దళం ఎలా ఉంది? మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, అణు బాంబుల ప్రయోగం వంటి వివరాలు; ఆధునిక భారతదేశ చరిత్రలో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధాలు, బంగ్లాదేశ్ విముక్తి పోరాటం; వివిధ యుద్ధాల పరిణామాలు; అమెరికా సోవియట్ యూనియన్‍ల పాత్ర గురించిన సమాచారం; కార్గిల్ యుద్ధానికి సంబంధించిన సమాచారం ఈ పుస్తకంలో లభిస్తాయి. విమాన వాహక నౌకల గురించి, జనరల్ కె.ఎస్. తిమ్మయ్య గురించిన విశేషాలు; ఓ విశిష్ట సైనికుడి జీవన విశేషాలు; యుద్ధ పురస్కారాలుగా అందించే పరమవీరచక్ర, అశోక్ చక్ర వంటి పతకాల వివరాలు తెలుపుతూ జాతీయ పతాకాన్ని ఎలా రూపొందిచాలో, అందులోని అశోక చక్రం విశిష్టత ఏమిటో తెలిపాను. ఇది యువతకు, చదువరులకు ఉపకరిస్తుందని ఆశిస్తున్నాను.
- కేకలతూరి క్రిష్ణయ్య, రచయిత
|
Top |
Click here to buy eBook. | ఆయుర్వేద విజ్ఞానము
ఆయుర్వేదము మన భారత దేశీయ వైద్యము. ప్రాచీన వేద సంస్కృతి నుండి ఆవిర్భవించి మన సంస్కృతి సాంప్రదాయాలతో లీనమై సమాజ ఆరోగ్య అవసరాలను తీర్చడములో ప్రముఖ పాత్ర పోషిస్తున్నది. ఋషి పరంపరగా ప్రాప్తించిన ఆయిర్వేదము అనాదిగా మన జీవన విధానమై ఆరోగ్యానికి అమృత భాండాగారముగా భాసిల్లుతున్నది. హితకరమైన, సుఖకరమైన దీర్ఘాయుష్షు పొందడానికి కావలసిన ఆరోగ్య సూత్రాలను తెలియజేస్తుంది. పలురకాల ఆహారాలను మరియు ఔషధాలను సంస్కరించుకొనే విధి విధానాలను తొలిసారిగా పరిచయము చేసినది కూడా ఆయుర్వేదమే. ఆరోగ్య పరిరక్షణ, స్వస్థపరిపాలన, రోగనిర్మూలన ప్రధాన ఉద్దేశములుగా కలిగి అన్ని వైద్య విధానాలకు తల్లి పాత్రను పొంది ప్రాముఖ్యతను గడించినది. చతుర్విద పురుషార్థములను సాధించుటకు ప్రతి ఒక్కరికి ఆరోగ్యము అవసరము. కేకలతూరి క్రిష్ణయ్యగారు రాయలసీమలోని చిత్తూరు జిల్లా వాసులు. బహుముఖ ప్రజ్ఞాశాలి. నాన్నగారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు కావడం వలన వీరికి ఆయుర్వేదము మీద అవగాహన, అభిమానము, గౌరవము మూలంగా ఆసక్తి పెరిగి ఆయన కలం నుండి జాలు వారిన ఈ పుస్తక రత్నము – “ఆయుర్వేద విజ్ఞానము” - జన బహుళ్యంలోనికి వెళ్ళి జనసామాన్యానికి ఉపయోగపడి జనాదరణ పొందగలదని నా అభిలాష. ఆయుర్వేదము ఇతిహాసము(చరిత్ర)తో మొదలుపెట్టి, మూలసిద్ధాంతములను పరిచయము చేస్తూ, శరీరములోని ప్రముఖ అవయావాల కార్యకలాపాల మీద అవగాహన కలిపిస్తూ, వివిద ఆహారపదార్థములు, ఇతర పలు ద్రవ్యములు, మూలికలు – వాటి ప్రాముఖ్యతను ఒక క్రమ పద్ధతిలో వివరించడానికి ప్రయత్నము చేశారు. అంతేగాక సాధారణ ఆరోగ్య సమస్యలను ప్రకృతిలో మన చుట్టు దొరికే పలు వనమూలికలతో ఎలా నివారించుకొని నిర్మూలించుకోవాలో తెలిపారు. క్షేత్రీకరణకు ఉపకరించే పంచకర్మల గురించి పేర్కొన్నారు. పాముకాటు, తేలుకాటు, పురుగుకాటు మొదలైన వాటికి గృహవైద్యం చెప్పారు. ప్రముఖ ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో పేర్కొన్న మరియి అనుభవవైద్యము ద్వారా వివిధ రకాల రసఔషదాలు, తైలాలు, చూర్ణాలు, ఏక మూలికలను పరిచయము చేశారు.
వృత్తి వేరైనా, ప్రవృత్తి ధర్మంగా ఆయుర్వేదాన్ని సమాజ కల్యాణం కోసం పరిచయము చేస్తున్న గౌరవనీయు శ్రీ కేకలతూరి క్రిష్ణయ్యగారిని అభినందిస్తున్నాను. - డా. డి. నారపరెడ్ది,
బిఎఎంఎస్, ఎండి(ఆయు), పిహెచ్.డి.
|
Top |
Click here to buy eBook. | ఎయిడ్స్ వ్యాధి వివరాలు - నివారణ మార్గాలు
ఎయిడ్స్ ఒక సుఖవ్యాధి, అంటువ్యాధి. అంటువ్యాధుల బారిన పడి జనపద ధ్వంసములు జరుగుచున్నవి. అంటువ్యాధుల బారిన పడకుండా వుండడానికి మన చుట్టు వుండే పరిసరాల పచ్చదనం, పరిశుభ్రతతో పాటు స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం సమకూర్చుకోవడంపై అవగాహనను పెంపొందిచుకోవాలి.
ప్రపంచములో ఎయిడ్స్ మహమ్మారి సోకి లక్షలాది మంది ప్రాణాలు విడుస్తు, ప్రభుత్వాలకు దానిని అరికట్టడం పెను సవాలుగా మారింది. ఈ సమయములో ముఖ్యంగా పెళ్ళిగాని యువత, పెడదారిన వెళుతున్న యువతీ యువకులకు దాంపత్యజీవితం మీద అవగాహనతో పాటు, అంటువ్యాధులు ముఖ్యంగా ఎయిడ్స్ వ్యాధి మీద యువతకు అవగాహన కొరకు ఈ పుస్తకం ఎంతో దోహదపడుతుంది. ఎయిడ్స్ వ్యాధికి కారణాలు, వ్యాధి లక్షణాలు, పరిణామాలు, ఉపద్రవాలు, ముందస్తు జాగ్రత్తలు, ఆహారం, వాతావరణము, వసతి సౌకర్యాలు, రోగగ్రస్థులతో ఎలా మెలగాలి, వారిని ఎలా ఆదరించాలి అనే పలు విషయాలతో పాటు పలు వైద్య విధానాలతో అందుబాటులో వున్న చికిత్స విధానాలపై అవగాహన కల్పిండానికి ప్రయత్నించారు. - డా. డి. నారపరెడ్ది, బిఎఎంఎస్, ఎండి(ఆయు), పిహెచ్.డి.
|
Top |
Click here to buy eBook. | స్త్రీ జీవితం ఆరోగ్య సమస్యలు
ఆరోగ్యపరమైన, ప్రబోధాత్మకమైన రచనలే కాకుండా, విశ్వప్రేమ తత్వామృతాన్ని, ఆరోగ్యపరంగా, ప్రేమ పూర్వకంగా అందజేస్తు - ప్రేమ తత్వాన్ని ఎలా పెంపుజేసుకోవాలో - ఎలా పంచాలో- పరిపూర్ణారోగ్యాన్ని ఎలా సొంతం చేసుకోవాలో - రచనల ద్వారా తెలియజేస్తున్న మానసిక విశ్లేషకుడు క్రిష్ణయ్యగారు. అనేకానేకులకు ఆరోగ్య సూత్రాలను అందిస్తూ - ప్రబోధిస్తూ - అదే తన జీవిత గమ్యంగా - ఆరోగ్య రహస్యంగా భావిస్తున్న క్రిష్ణయ్యగారు స్త్రీ జీవితం - ఆరోగ్య సమస్యలపై దృష్టి సారించారు. స్త్రీ జీవితం ఆరోగ్యవంతంగా వుంటేనే సమాజం ఆరోగ్యవంతంగా వుటుంది కనుక స్త్రీలు తమ ఆరోగ్యాన్ని అనేక విధాలుగా పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంటుందనీ, కుటుంబ బాధ్యతలలో, కుటుంబంపైనే దృష్టి పెట్టే వారి ఆరోగ్య పరిరక్షణే తమ ఆరోగ్యాన్ని రక్షిస్తుందన్న అమాయకత్వంతో - తమని తాము అలక్ష్యం చేసుకుంటున్న స్త్రీల కోసం వారి ఆరోగ్యంపై పూర్తి అవగాహనను కలిగించాలనే బృహత్తర లక్ష్యంతో - 'స్త్రీ జీవితం - ఆరోగ్య సమస్యలు' అనే ఈ గ్రంథాన్ని క్రిష్ణయ్యగారు - స్త్రీ జాతికి అంకితం చేశారు. స్త్రీల పరమైన ఎన్నో ఆరోగ్య సమస్యలను వివరిస్తూ యుక్త వయస్సులో వారు ఎదుర్కుంటున్న ఆనారోగ్య పరమైన విషయాలను, నివారణోపాయాలను, వైవాహిక జీవితంలో ఎదురయ్యే అనేకానేక సమస్యల తాలూకు - విశ్లేషణలనూ, అందుకు అనుసరించి ఆచరించి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోగల పద్ధతులనూ - ఈ గ్రంథంలో కూలంకుషంగా చర్చించి - వివరించి మన ముందుంచిన శ్రీ క్రిష్ణయ్యగారు ఎంతైనా అభినందనీయులు. ఈ గ్రంథంలో పిల్లల వ్యక్తిత్వ నిర్మాణం గురించి, పిల్లల వ్యక్తిగత పరిశుభ్రత గురించి, యుక్త వయసు లక్షణాల గురించి, సాధారణంగా బహిష్టు సమయాలలోనూ, మెనోపాజ్ సమయంలోనూ స్త్రీలు ఎదుర్కునే సమస్యల గురించి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి, గర్భిణీ స్త్రీలు తీసుకోవలసిన ఆరోగ్య పరిరక్షణల గురించే కాకుండా వైద్యరంగంలో కూడా విశేష పరిజ్ఞానం గల క్రిష్ణయ్యగారు ఆరోగ్య పరంగా ఎన్నో ఆరోగ్య సూత్రాలనూ - ఆరోగ్య ప్రక్రియలనూ - సందేశాత్మకంగా - సర్వులకు అందించిన తీరు న భూతో న భవిష్యతి. స్త్రీలు పఠించి, ఆచరించి, ఆరోగ్యాన్ని సొంతం చేసుకోగల ఆరోగ్య సూత్రాలను పొందికగా పొందుపరిచిన ఈ గ్రంథం ప్రతీ వారి చేతుల్లో వుండదగినది. సంపూర్ణారోగ్యాన్ని కైవశం చేసుకోటానికి ఆరోగ్యపరమైన డిక్షనరీ లాంటి ఈ గ్రంథం ఒక్క స్త్రీలకే కాదు, సర్వులకూ ఆరోగ్య దీపికే. - డా. కె.వి. కృష్ణకుమారి, హైదరాబాద్.
|
Top |
Click here to buy eBook. | భక్తాగ్రేసరులు
ఆత్మజ్ఞానం లేనిదే ముక్తి లేదు. భోగియైనా, యోగియైనా, బైరాగియైనా మనస్సు బ్రహ్మమందు నిల్పాలి. తనను తాను బ్రహ్మగా అనుభూతినొందాలి. అటువంటి ప్రయత్నాలు చేసి ఆత్మజ్ఞానం పొంది ముక్తి పొందిన మహాభక్తులు చాలా మంది ఉన్నారు. సమాజానికి జ్ఞానమార్గాన్ని గురించి తెలియపరచాలని, అటువంటి భక్తాగ్రేసరుల గురించి ఈ పుస్తకం వ్రాయడం జరిగింది.
పురాణకాలం నాటి భక్తులే కాకుండా ఆధునిక భక్తాగ్రేసరులు గొప్పవారే! అలానాటి భక్తులకు తీసిపోనివారే. అటువంటి భక్తాగ్రేసరులు కొందరిని ఈ పుస్తకం ద్వారా స్మరించుకుంటున్నాను.
ఇందులో సూరదాసు, రామానుజాచార్యులు, కబీరుదాసు, ఆళ్వార్లు, మీరాబాయి, తులసిదాసు, సమర్థ రామదాసు, అన్నమయ్య, గోదాదేవి, నామదేవుడు, రూప గోస్వామి, ఛత్రపతి శివాజీ, అరబిందో, చైతన్య మహాప్రభు, త్యాగరాజు, బమ్మెర పోతన వంటి చిరపరిచిత భక్తాగ్రేసరులతో పాటు సాధారణ పాఠకులకు అంతగా పరిచయం లేని రామచర్ల వేంకటదాసు, సూరారం కవి రంగదాసు, స్వామి కృష్ణానంద, బిహారీ లాల్ చౌబే, కృపాళు మహరాజ్, జీవా గోస్వామి వంటి భక్తాళువులను ఈ పుస్తకంలో పేర్కొన్నాను.
వీరే కాక,ఆధునిక భక్తుల వివరాలు కూడా సేకరించి ఈ పుస్తకం ద్వారా అందిస్తున్నాను. జీవితంలో అనేక కష్టనష్టాలను ఎదుర్కుని, భగవంతుడిపై అచంచల విశ్వాసం ఉంచి తమ కార్యరంగంలో విజయవంతమైన కొందరి గురించి కూడా ఈ పుస్తకంలో పేర్కొన్నాను. నా ఇతర రచనల లాగానే ఈ పుస్తకం కూడా సమాజానికి ఉపకరిస్తుందని ఆశిస్తున్నాను.
- కేకలతూరి క్రిష్ణయ్య, రచయిత
|
Top |
Click here to buy eBook. | దివ్యాంగులు - ఆత్మవిశ్వాసం
వికలాంగుల పట్ల సమాజంలో ఏర్పడిన వివక్షను తొలగించి, వారిలో ఆత్మవిశ్వాసం నింపేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలలో కొన్ని - వారిని 'దివ్యాంగులు'గా గుర్తించడం! 'Disabled' అని కాకుండా 'Differently abled' గా పిలవడం!
అంతేకాక, 'చేతకాని వారు' స్థాయి నుంచి 'ఇతరత్రా సమర్థులు' అనే స్థాయికి తీసుకు రావడం! వారికి కల్పించే సౌకర్యాలను మెరుగు పరచడం! ఈ చర్యల వల్ల కాస్తయినా మేలుకలిగి దివ్యాంగులలో చైతన్యం కలిగింది. వారికి అవసరమైన చేయూత - ఆర్థికంగా, మానసికంగా, సామాజికంగా అందించేందుకు ప్రభుత్వం, వ్యక్తులు, సమాజం పూనుకున్నాయి.
ఈ పుస్తకంలో అంగవైకల్యంలోని రకాలు, అవి ఏర్పడడానికి గల కారణాలు, కుటుంబం యొక్క పాత్ర మార్పు కోసం కృషి, ఆదరణ, ప్రేమ, విద్య, ప్రభుత్వ మార్పులు తదితర అంశాలు దివ్యాంగుల జీవితాలను ఎలా ప్రభావితం చేయగలవో తెలిపాను.
దివ్యాంగులకు ఉద్యోగాలు, వనరులు, వివిధ దేశాలలో దివ్యాంగులకు లభించే అవకాశాలు, మార్పుకు కృషి చేసిన వ్యక్తుల జీవితాల గురించి క్లుప్తంగా ప్రస్తావించాను. దివ్యాంగులలో అనారోగ్యము, పేదరికము వంటి సమస్యలు, సమాజం యొక్క అవగాహన లేమి తదితర అంశాల ద్వారా వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వెల్లడించాను.
వికలాంగులకిచ్చే ప్రోత్సాహాలపై ప్రచారం కరువైన వైనం, ప్రైవేటు రంగంలో కల్పించవలసిన రిజర్వేషన్ సౌకర్యం, ఉద్యోగాలలో అందించాల్సిన ఆసరా వంటివి చర్చించాను.తాము స్వయంగా దివ్యాంగులు అయినప్పటికీ, ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన కొందరి జీవన రీతులని వివరించి ఉత్తేజం కలిగించే ప్రయత్నం చేశాను. వైకల్యం ఉన్నా, దానిని అధిగమించి జీవన పోరాటం చేసేలా ఈ పుస్తకం తోడ్పడితే అదే నాకు సంతోషం.
- కేకలతూరి క్రిష్ణయ్య, రచయిత
|
Top |
Click here to buy eBook. | విజ్ఞానదాయకం
ఇప్పటికే నేను ఈ పుస్తకముతో మొత్తం 31 పుస్తకములు రచించాను. అన్ని వివిధ అంశాల్లో సమాజ శ్రేయస్సు కోరి వ్రాశాను. నేను సుమారుగా పది సంవత్సరములపై నుంచి నా పేపర్లు, వార పత్రికలు, మాసపత్రికలు మరియు ఇతర వివిధములగా నాకు మంచిగా ఉందనుకున్న విషయాలు చిన్నవిగానీ, పెద్దవిగానీ చూస్తే వెంటనే వాటిని ఒక పేపరు మీద వ్రాసి ఉంచుకునేవాడిని. వాటినన్నిటిని ఒక చిన్న పుస్తకం ప్రచురిస్తే సమాజానికి ఉపయోగపడునని, ఆ విషయాల్ని "విజ్ఞానదాయకం" అనే పేరు మీద ప్రచురించుచున్నాను.
- కేకలతూరి క్రిష్ణయ్య, రచయిత
|
Top |
|