Home Books About Me Media Room Openions Contact  

పరిష్కృత లేఖిని

తేది: 10-06-2013

ఏ పుస్తకమైనా మస్తకానికి గీటు రాయి లాంటిది. అంటే గ్రంథ పఠనం మన తెలివితేటల్ని ఇనుమడింపజేస్తుందనడంలో నిజానికి నిజం.
‘‘ సృష్టి - జన జీవన దర్పణం ’’ అనే ఈ గ్రంథానికి సృజనకర్త కేకలతూరి క్రిష్ణయ్య గారు. ఇది ఆయన పరిష్కృత లేఖిని నుండి వెలువడిన పదవ గ్రంథమనుకొంటాను.
సాధారణంగా బాల్యం నుండీ రచనా వ్యాసంగంలో తలమునకలై వ్రాస్తూ రచయితయ్యే వారు కొందరు, హాబీగా అప్పుడప్పుడూ వ్రాస్తూ రచయితనిపించుకునే వారు కొందరు, జీవిత చరమాకంలో రచనలు చేస్తూ రచయితయ్యే వారు కొందరు.
క్రిష్ణయ్య గారు చివరి దశలో రచయితగా మారి అమూల్య గ్రంథాలను పాఠకలోకానికి అందిస్తున్నారు. ఆయన తన జీవికను మూడు దశలుగా విభజించుకొన్నట్టు కనిపిస్తుంది. ప్రథమ దశ చదువు, ఉద్యోగం, ద్వితీయ దశ కుటుంబ సంక్షేమం, తృతీయ దశ రచనా వ్యాసాంగం. ఈ మూడు దశల్లోనూ, నిస్వార్దంగా, నిజాయితీగా, నిష్కర్షగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించుకొంటూ వచ్చారు. ప్రతి దశలోనూ తాత్కాలీన కార్యకలాపాలను త్రికరణశుద్ధిగా నెరవేరుస్తూనే, పుస్తక పఠనాన్ని కూడా జీవితానికి ఆలంబనగా గుర్తించి అందులోని ఆణిముత్యాలను ప్రోది చేసుకొని తన రచనా వ్యాసాంగానికి ఉపకరణాలుగా భద్రపరుచుకొన్నారు.
ఆయన వెలువరించిన ఏ పుస్తకం చదివినా ఇంత విలువైన సమాచారం తెలుసుకోలేక పోయినందుకు ప్రతి పాఠకుడూ ఆత్మ పరిశీలనలో అంతర్ముఖుడు కాకతప్పదు.
సృష్టి చైతన్య పురోగతి, జన జీవన విస్తరణ, విభిన్న మతాల ఆవిర్బావం, వేదోపనిషత్తుల ధార్మిక మర్మాలూ, హిందూ, ముస్లిం, క్రైస్తవ జనన - మరణ శాస్త్రోచిత విధులు, శాఖోపశాఖలుగా విస్తరించిన భారతీయ సంస్కృతి, ఇంత అనంత విశ్వ నిర్మాణ రహస్యాన్నంతా ఇనుస్టంటు ఫుడ్డులా పాఠకలోకానికి విందొనర్చిన క్రిష్ణయ్య గారి రచనా వైదుష్యం అనితర సాధ్యం.
ఆయన పరిశోధన, పరిశ్రమ ప్రస్తుత సమాజంలో ప్రతి ఇంటా, ప్రతి మనిషినీ ముప్పొద్దులా సరిదిద్దుతూ ముందుకు నడిపించేదే.
ఇలాంటి గ్రంథం కాలేజీ స్దాయిలో పాఠ్యాంశంగానో, సహాయక గ్రంథంగానో ప్రవేశపెడితే భారతీయ ఆచార వ్యవహారాలు జన జీవన స్రవంతిలో నిరంతరం సజీవంగా సాక్షాత్కరిస్తాయనడంలో సందేహం లేదు.
భారతీయ సంస్కృతిని ప్రస్పుటం చేసే ఇంకా అనేక గ్రంథాలు వ్రాయాలని, ఆరోగ్యాన్నీ , శక్తినీ మిత్రులు క్రిష్ణయ్య గారికి కలుగ జేయాలని ఆ భగవంతుని ప్రార్దిస్తూ. . .

  Top  

సద్గ్రంధం

తేది: 10-06-2013

ఈ పుస్తకంలో చరిత్ర వుంది, సైన్స్‌ వుంది, మతం వుంది, మానవత్వం వుంది, ఆచారం వుంది, పెళ్ళి వుంది. పుట్టుక వుంది, చావు వుంది, సంసారం వుంది. సంస్కృతి వుంది. అన్ని విషయాలు కళ్ళకు కట్టినట్లు అందించారు క్రిష్ణయ్య.
ఠాగూర్‌ రచనల గురించి, వివేకానందుని ఔన్నత్యం గురించి, బుద్ధుడి మంచిదనాన్ని గురించి, మనసుకు హత్తుకునేలా వ్రాశారు. అంతేకాదు నింగిలో ఉన్న నక్షత్రాల దగ్గర నుంచి నేలమీద వున్న జీవరాశులదాకా! అన్ని మతాల వివాహ, ఆచార, వ్యవహరాలు, పంచభూతాల పనితీరు, వాటి అవసరం సృష్టిలో ఎంతవుందో స్పష్టంగా తెలియజేశారు.
ఇది అందరూ చదవవలసిన గ్రంధం. ఇది పలు లైబ్రరీలలో ఉండదగిన గ్రంధం. ముఖ్యంగా కాంపిటేటివ్‌ ఎగ్జామ్స్‌కు సన్నద్ధంమయ్యేవారికి ఈ పుస్తకంలోని విషయాలు ఎంతో వుపయోగపడతాయి.
ఇంత విజ్ఞానాన్ని ఒక పుస్తకం ద్వారా ప్రపంచానికి అందించన ఆ కేకలతూరి క్రిష్ణయ్య గార్కి నా అభినందనలు.
ఒక్క మాటలో చెప్పాలంటే సనాతన, భారతీయ ధర్మాన్ని ప్రపంచానికి వినిపించేలాగ అక్షరరూపంలో నిరంతరం కేక పెట్టివాడే కేకలతూరి క్రిష్ణయ్య గారు.
ఈ కాలం పిల్లల్ని ఎలా వుంది అని అడిగితే వాళ్ళకు బాగా నచ్చితే చెప్పే సమాధానం ‘కేక’!

  Top  

సృష్టి - జనజీవన దర్పణం

తేది: 10-06-2013

శ్రీ కేకలతూరి క్రిష్ణయ్య గారు రచించిన ‘‘ సృష్టి - జనజీవన దర్పణం ’’ అనే గ్రంథం సృష్టి ఆవిర్భావం నుండి ప్రపంచంలో ప్రస్తుత పరిణామాల వరకు విపులంగా వ్రాశారు. ఇది పరిశోధనాత్మక గ్రంథంగా చెప్పవచ్చు.
సృష్టి చైతన్య పురోగతి, జనజీవన పరిణామాలు, వివిధ మతాల అవ తరణ, వివిధ గ్రంథాల ధార్మిక మర్మాలు, హిందూ, ఇస్లాం, క్రైస్తవ జీవన ` మరణ మరియు ఆచార వ్యవహారాల వివరణ ఇందులో ఇవ్వడం జరిగింది. భారతీయ శాఖోపశాఖల సంస్కృతి మరియు అనంత విశ్వ రహస్యాన్నంతా పాఠక లోకానికి సర్వ రుచులతో మృష్టాన్న భోజనం వలె శ్రీ కృష్ణయ్య గారు అందించారు. వీరి అపారకృషికి నా అభినందనలు.
మతముల బాధ్యతలు, ఆయా మతముల మూల పురుషులు వారి మూల గ్రంథాల వివరాలు, మత సామరస్యం, దైవత్వం, కర్మల ఫలితాలు, నిత్య జీవన విధానం, విశ్వ ప్రేమను గూర్చి చాలా వివరముగా ఈ గ్రంథంలో వివరించ బడిరది. ఇన్ని సృష్టి, జనజీవన విలువైన రహస్యాలు, యదార్థ చరిత్రలు ఒక గ్రంథంలో ఇమర్చడం చాలా గొప్ప విషయం.
ఈ ‘‘ సృష్టి - జన జీవన దర్పణం’’ గ్రంథం ప్రతి ఒక్కరూ చదవదగింది. విద్యార్థులకు పోటీ పరిక్షలకు పనికి వస్తుంది. అన్ని గ్రంథాలయములలో ఉంచ దగింది. ఆయన అనుభవాన్నికూడగట్టి శ్రీ క్రిష్ణయ్య గారు ఇంతవరకు వైవిధ్యభరితమైన గ్రంథాలను సమాజ శ్రేయస్సు కోరి అందించారు. వీరు ఇప్పుడు 75 సంవత్సరాల వయస్సులో కూడా ఓర్పుతో రచన కొనసాగిస్తున్నందుకు అభినందిస్తూ, ఇంకా ఎన్నో రచనలను సమాజానికి అందించే శక్తి, సామర్థ్యాలు కలుగజేయమని దేవుని ప్రార్థించుచున్నాను.

  Top  

I deeply appreciate Mr. Kekalathur Krishnaiah for the trememendous hard work he has put in to write a comparative study of religions. Its a herculcan task. I am surprised he not only tried to write about the religious books but also about present day practices in detail. Coming to Christianity, with due respect to the author's sincere effort, I must confess, the author tried his best to explain Christianity and the Bible. But One needs to distinguish between what is from God and what is from Man. Many have unknowingly rerestried the Bible, which is God's self-revelation to man, with their own limitations and interpretations. I would have loved to see this book not mix up the revelations of God and practices of man. Not every practice of Christians today is Bible based and authentic. There are several practices which
are influenced by different factors. But the revelation of God is eternal. Well, I agree, one cannot do justice to all this in one book, thats why the efforts of Mr. Krishnaiah are appreciated though I don't endorse every interpretation in this book, specially
in connection with Christianity.

Overall, its good book for a bird's eye-view of different religious.

  Top  

మానవత్వాన్ని పాదుగొలిపే పుస్తకం

విశిష్ట రచనలతో బహుగ్రంథ రచయితగా అశేష ప్రజాదరణ పొందిన కేకలతూరి క్రిష్ణయ్య గారి తాజా పుస్తకం ’సృష్టి జన జీవన దర్పణం’ నిజంగా ఒక అద్భుత ఆవిష్కరణ. ఈ పుస్తకం ద్వారా ఆయనలో నిబిడికృతమై ఉన్న బహుముఖ ప్రజ్ఞ మరో మారు తేటతెల్లమైంది. స్వభావం రీత్యా, పుస్తక రచనా క్రమం విభిన్నమే అయిన్నప్పటకీ, పుస్తక స్వరూపం కూడా అంతే విశిష్టమైనదని చెప్పవచ్చు. వివిధ మత భావనలకు పుస్తకంలో చోటు కల్పించిన్పటికీ, హెచ్చుతగ్గులకు ఆస్కారం లేకుండా అన్నీమతాల సారాశం పాఠకులకు నేరుగానే చేరిందని చెప్పక తప్పదు.
విభిన్న మత భావనలు, భిన్న ఆధ్యాత్మిక బోధనలు, విరుద్ధ మతాచారాలకు ఒకే పుస్తకంలో చోటు కల్పించడం విఫలప్రయత్నం అనే భావన అందరిలో సర్వసాధారణం. కాని భిన్న మతాల సమాచారాన్ని రచయిత ఎంతో ఓర్పుతో సేకరించారనే చెప్పాలి. సంగ్రహించిన విషయాలను ఎంతో ఒడుపుగా, మరెంతో నేర్పుగా పుటల్లో చేర్చారని అంగీకరించాలి. ఇది ఎంతగానో అభినందించదగిన అంశం.
వ్యక్తిగా తానొక ధర్మావలంబీకుడైనప్పటికీ, పుస్తక రచనా క్రమంలో, రచయితగా ఆయన తన ధర్మం ఎక్కడా తప్పలేదు. మతాల్లోని మౌలిక విషయాలను తనదైన శైలిలో అవగతం చేసుకున్న ఆయన, ఉన్నది ఉన్నట్లుగానే అక్షరయుక్తం చేసే ప్రయత్నం చేశారు. తాను ఎంతగానో శ్రమించి సేకరించిన సమాచారాన్ని, నిస్పాక్షికంగా అవనతం చేశారు.
కులం కుచ్చితాలనుంచి, మత దురాభిమానాలనుంచి సామాజాన్ని పరిరక్షించాలనే ఆయనలోని తపన, ఆయన ద్వారా ఈ పుస్తకం రాయించిందని చెప్పడానికి సందేహించనక్కర్లేదు. మతాలన్నీ మానవత్వాన్ని ప్రభోదిస్తున్నప్పుడు, మతాల అనుయాయులుగా మనుషుల మధ్య మానవత్వం పునాదిగా మమతానురాగాలు బలపడాలి. మానవ సమాజంలో పరస్పర స్నేహం, ప్రేమభావం, సోదరభావం, సహిష్ణుకత పాదుకోవాలి.
కాని తద్‌భిన్నంగా ఒక మతమంటే ఇంకొక మతానికి గిట్టని తనం. ఒక మతాచారికి ఇంకొంక మతం వాడంటే అలుసు. ఎందుకో కారణం చెప్పలేని అసహ్యం. పరస్పరం నిందా రోపణలు,విరుద్ధప్రచారాలు. వీటన్నిటికీ ఒకే ఒక కారణభూతం. ఆయా మతాలవారికి వారి వారి మత ప్రబోధనల పట్ల అవగాహనాలోపం. మతాచారాలు, ధార్మిక వ్యవహారాల పట్ల సంకుచితత్వం. మనుషులు మతాన్ని నామక: ఆచరిస్తున్నారే కాని, ప్రబోధాలను ఆచరణాత్మకంగా పాటించడం లేదనేది నగ్నసత్యం. మతాల మధ్య నెలకొన్న ఇటువంటి కొరతను ఈ పుస్తకం కొంత వరకు తీర్చింది. మనుషుల మధ్య కొలువుతీరిన అగాథాన్ని చాలా మేరకు పూడ్చగల్గింది.
ఈ పుస్తకం చదివిన ఎవరికైనా తాను పుట్టిన మతం గురించే కాక, ఇతర మత ప్రబోధాల గురించి కొంత అవగాహన ఏర్పడుతుంది. పరుల గురించి మెదడులో వారసత్వంగా పేరుకుపోయిన విషప్రభావం క్రమ క్రమంగా తొలిగిపోతున్న అనుభూతి కల్గుతుంది.
ఏ మతమైన మనుషులకు వైషమాన్ని బోధించదు. మతాల మధ్య వైమనశ్యాన్ని అంగీకరించదు. మతాలు వేరైనా సారం అన్నింటా ఒక్కటే. అన్ని మతాల మూల ప్రబోధం ఒక్కటే. అది తమ సృష్టికర్తను గురించమని. ఆ ఏకత్వాన్ని అంగీకరించమని. వసుదైకుటుంబమై కర్మయోగులుగా జీవించమని, సాటి మనిషికి సహాయ పడమని, మనిషి జన్మ ఎత్తినందుకు మనిషిగా బతకమని, మానవత్వం నిలుపమని... మతంలో మంచితనాన్ని, మనిషిలో మానత్వాన్నిపాదుగొలిపేదే ఈ పుస్తకం, ఇది నిజంగానే సృష్టి జన జీవన దర్పణం..
మానవులారా మీప్రభువుకు భయపడండి.ఆయన మిమ్మల్ని ఒకే ప్రాణి నుంచి పుట్టించాడు. అదే ప్రాణినుంచి దాని జతను సృష్టించాడు.ఇంకా ఆజంట ద్వారా ఎంతోమంది స్రీ,పురుషులను అవనిలో వ్యాపింపచేశాడు. (దివ్యఖురాన్‌ 4:1)

  Top  

తత్త్వజ్ఞానానికి ప్రామాణిక గ్రంథం

తన మరణానికి ఒక సంవత్సరము ముందు, అనగా 1899లో, తత్త్వవేత్త జర్మనీ దేశస్తుడైన మాక్స్ ముల్లర్‌ ‘‘The six systems of Indian Philosophy " అనే తన రచనకు స్వయంగా ఉపాద్ఘాతం వ్రాస్తూ తాత్త్వికుడు అనబడే వారు ప్రఖ్యాత పాశ్చాత్యులైన తత్త్వవేత్తలు, అరిస్టాటిల్‌ 384- 322 బి.సి., గ్రీస్‌, ప్లాటో 428-347 బి.సి., గ్రీస్‌, హిరాక్లిటస్‌ 534- 475బి.సి.,గ్రీస్‌, థేల్స్‌ 624- 546 బి.సి., గ్రీస్‌ Descartes (1596-1650., France) Spinoza (1632-1677., Holland) వంటి తత్వజ్ఞులనే కాకుండా భారతీయ వేదాంత, సాంఖ్య రచయితలను చదివి వుండవలెనని పేర్కొన్నాడు. తనకు వయస్సు ఉడిగిందని, యవ్వనంలో తనసాటి రచయితలకు, గురువులను సహకరించినట్లు తనకు కూడా సహకరించాలని కుర్రకారును ఆహ్వానించాడు. విరుద్ధ భావజాలం అయినప్పటికీ, భారతీయ తాత్త్వీకులు నిర్భయంగా తమ సిద్ధాంతాలను వక్కాణించారని సమస్త లోకానికి ప్రకటించాడు. మాక్స్‌ముల్లర్‌కు ఈ అభిప్రాయం కలగటానికి ఒక కారణం ఏమై ఉండవచ్చునంటే Spinoza కు మునుపు గతించిన పలువురు తాత్వికులు జడము-చేతనము, శరీరము - ఆత్మ వేరు వేరు అని ప్రవచించగా, తన Mein-Kamph గ్రంధములో Adolf Hitler (1889-1945, Germany) చే దూషణకు గురి అయిన డచ్‌ యూధుడు అయిన Spinoza శరీరం-ఆత్మ వేరు - వేరు కాదంటూ Hegal (1770-1831 Germany) అనే తాత్వికుడికి గతి తార్కిక భౌతిక వాదం ప్రవచించేందుకు దోహదపడి, తద్వారా Karl Marx (1818-1883 Germany) కు తార్కిక భౌతిక వాదం ద్వారా ఆర్ధిక కారణాలపై రాజకీయ నిర్మాణాలను రచించేందుకు స్ఫూర్తి నిచ్చాడు. ఈ విధంగా కమ్యూనిజం అవతరించింది. భారతీయ తత్వజ్ఞానంలో ఈశ్వర - అనైశ్వర సిద్ధాంతాలు పాశ్చాత్యులకు పూర్వం సైద్ధాంతికరింపబడినప్పటికీ అవి రాజకీయాలకు అతీతంగా ఉండినవి.
అట్టి వయోదశలో వున్న కేలతూరి క్రిష్ణయ్య గారు ఎట్టి సహాయం ఆర్ధించకుండానే హిందూ, మహ్మదీయ, జైన, బౌద్ధ, క్రైస్తవ ఆలోచనారీతులను, ఆచార వ్యవహారాలను, జీవన విధానాలకు కొంత జీవ విజ్ఞానం కూడా జోడించి, మాక్స్‌ముల్లర్‌నే కాకుండా మరెందరో తత్త్వజ్ఞులను ఉటంకిస్తూ, ఇటు భారతీయ తత్త్వజ్ఞానమే కాకుండా, అటు మధ్య ఆసియాలో పరిణమించిన విశ్వాస వ్యవహారాలను, తత్త్వజ్ఞానాన్ని- సూక్ష్మస్థాయిలో విశ్లేషించి, చేసిన ఈ రచన అటు పండితులకూ, ఇటు మిడిమిడిజ్ఞానము గల నాలాంటి విద్యార్ధులకూ, పామరులకు సైతం ఒక ప్రామాణిక గ్రంధంలా నిలుస్తుంది. భారతావనిలో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక వారసత్వాన్ని సరళ పదజాలంలో వ్యవహారిక ఉపయోగార్ధం బహుళ జనానికై విశ్లేషించి, క్రోడికరించి రచించడం సరళమైన ప్రక్రియ కాదు. కలకత్తాలోని వివేకానంద ప్రదర్శనశాలలో వివేకానందుడు R.W.Emerson (1803-1882, American) రచించిన Essays అనే గ్రంధం చదివినట్లు గమనించాను. అట్టి R.W.Emerson ను సైతం క్రిష్ణయ్య గారు ఉటంకించారు. ఇటువంటి విజ్ఞానాన్ని, ముఖ్యంగా హిందు తత్త్వజ్ఞానాన్ని పాశ్చాత్యులకు అందించే ప్రక్రియ - ఇంగ్లాండు దేశస్ధుడైన విలియం జోన్స్‌ (1746-94) తో ఊపందుకుందని చెప్పవచ్చు.. అంతకు మునుపు ఎన్నో భారతీయ తత్త్వ రచనలు పారశీక భాషలో అనువదింపబడి యూరప్‌ చేరుకున్నాయి. ఇటువంటి ఎందరో మహామహుల జ్ఞానతిమిరంలోంచి కొన్ని బిందువులను ఏరి క్రిష్ణయ్య గారు చేసిన ఈ రచన దివంగత ఆచార్యుడు A.L.Basham చేసిన The wonder that was India అనే రచనను గుర్తు చేస్తున్నది.ఎందరికో భిన్నంగా, సకల విశ్వాసాలను వాసనారహితంగా చదువరి లోగిలికి చేర్చిన క్రిష్ణయ్య గారు ధన్యులు. వారికి తోడ్పడిన వారికి, అనంత వ్యాపితుడు, ఏకం అయిన పరమార్థుడు - అన్ని విధాల ఆదుకోవాలని, ఇటువంటి రచనలలో ఉత్తమత్వాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ. . . !

  Top  

B. Sarada, B.Sc., B.Ed.,
Retd. Head Mistress

The famous mathematician Sri. Ramanujan was born at "Eroad" in Thamilnadu in a middleclass family. In his childhood he worked as a sales boy in a cloth shop. Latter on he became a world famous mathematician. He dis covered a new theory in "Trigonometry". Many more Scientists aslo faced pavery in their lives. Dr.Abdul Kalam was born in a small village near Rameswaram in a poor family and became the President of India. In his childhood he destributed daily news papers in Madras Railway station. Likewise Sri Kekaltur Krishnaiah was also bron in Samkampalli Village near Tirupathi in a poor family, and became to the present status with his own self efforts. He started Sneha Seva Samstha with Friends and served the socieity. He lost his father at his early age and with the help of his mother, brother, and sisters he completed his Secondary Education with his own skilled nature he worked in India and abborad satisfactionally. Even after 69 years of age without taking rest he became a writer of many books with his own style. In his writtings explained facts with his own experience.

The present book "ART OF BRINGING UP CHILD - RESPONSIBILITIES OF ELDERS" is very easy to follow. Childrens mind is like wax. It is thiswish that parents, teachers, and elders has to mould their minds in right way to meet the present world trend. The zeal in him made to collect so much matter with his ability and presented to the reader like joke fruilt seeds. The proverb
is a "Strong mind in a strong body". Hence Sri K. Krishnaiah insisted on balanced diet, family circumstances, school atmosphere and environmental conditions should be good for the improvement of children physically and mentally. He explained the relationship between the mother (first teacher)-child, featal reactions to sound when it is in mother's womb; food habits according to age and weight - with examples and data collection. He said that a child can develop charector and moral values through stories from the mother. In his view childhood is more important than rest of the life. I request and suggest that every parent has to go through the book and there by mould their children in a right way.



C. Kesavulu, B.Sc., B.Ed., Retd. Headmaster Chittor.


Sri Kekalathr Krishnaiah is a writer of many books with variation of subjects. In my view, in his life itself he played different roals. He was a public servant, an athlete, a private employee, a doctor, a farmer, a surveyor, an Engineer, a contractor and now a wirter. what he would
be....?


Now in this book ""ART OF BRINGING UP CHILD - RESPONSIBILITIES OF ELDERS" with social responsibility he wants to give a message to the society.

People know how to give birth to a child-but howmany of them knew how to brought them up in a right way? Even amoung the known people howmany at them are putting into practice? Because of not putting into practice howmuch damage is causing directly to the parents and indirectly to the society? Who is responsible for the illegal activities and un-social activities in the society?

Teaching community has more responsibility than parents in shaping the children in a right way. One of the famous Educationist Dr. Kottari said that "ANations desting is shaped in the class-room".

To some extent we can understand that poor parents may not give balanced diet to their children and hence their children may be facing ill-health problems. But what about the children of rich parents. Some of their children are also facing physical and mental problems-why? Can't they feed balanced diet to their children? Or they don't know about balanced diet? suppose inspite of knowing are they neglecting their children? If so why?

To answer all these questions, in my view, Sri. K. Krishnaiah feeling social responsibility brought this book to serve the society at his level.

If all parents read this book, understand the content and follow sincerly, they can see wonderful results in their children. They can see not only rank children but also cultured, disciplined, duty minded, responsible, obedient and brave children with moral values and scholarly qualities. Teacher community may also feel happy.

Whole-heartedly I congratulate Sri K. Krishnaiah for having brought such a nice and useful book presented to the society. Wishing and expecting many more such kind of books from his pen. . .


  Top  

A strong mind in a Strong body

ప్రముఖ గణిత శాస్త్రవేత్త అయిన శ్రీ రామానుజన్ తమిళనాడులోని 'ఈరోడ్' నందు మధ్య తరగతి కుటుంబంలో జన్మించి పొట్టకూటి కొరకు చీరల దుకాణంలో కూడా పని చేశారు. తరువాత ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గణిత శాస్త్రవేత్త అయినారు. అలాగే అనేక శాస్త్రవేత్తలు కూడా తమ జీవితాలలో దారిద్ర్యాన్ని అనుభవించారు.
డా. శ్రీ అబ్దుల్ కలాం గారు రామేశ్వరం సమీపంలో ఒక చిన్న పల్లెలో జన్మించి భారత ప్రథమ పౌరుడయ్యారు. వీరు బాల్యంలో రైల్వేస్టేషన్‍లో దినపత్రికలు పంపిణీ చేశారు. అలాగే శ్రీ కేకలతూరి క్రిష్ణయ్య గారు కూడా తిరుపతి సమీపంలోని 'శంఖంపల్లె' అను గ్రామంలో జన్మించి స్వయంకృషితో ప్రస్తుతమున్న స్థానానికి చేరుకున్నారు. స్వయంగా "కె.కె. ఎంటర్‌ప్రైజస్" అనే సంస్థ ద్వారా సమాజానికి సేవలు చేసారు. చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకుని తల్లి, సోదరుడు, సోదరిల సహకారంతో పాఠశాల విద్య పూర్తి కాగానే, సంపాదనపై దృష్టి పెట్టి అనేక చోట్ల దేశ, విదేశాలలో తన నైపుణ్యాన్ని ఉపయోగించి వృత్తిధర్మాన్ని నిర్వహించారు.
65 సంవత్సరాల తరువాత విశ్రాంతి తీసుకోవలసిన వయస్సులో తనలోని రచయితను మేల్కొలిపి తనకంటూ వున్న ప్రత్యక శైలిలో అనేక రచనలు సాగించారు. ‘‘ పిల్లల పెంపక విజ్ఞానం పెద్దల బాధ్యత’’ అనే ఈ గ్రంథం ఆచరణ సాధ్యంగా వుంది. పిల్లల మేధస్సు మైనము వంటిది. పెద్దలు ` తల్లిదండ్రులు ` ఉపాధ్యాయులు పిల్లల మేధస్సును సరియైన పద్ధతిలో తీర్చిదిద్దాలనే ఆయన ఆకాంక్ష. తనలో వున్న ఆరాటాన్ని తనకు తెలిసిన విషయాలను, సేకరించిన పరిజ్ఞానాన్ని పనసతొనలు వొలచి పెట్టినట్లు మన ముందుంచారు.
"A strong mind in a Strong body" అన్నారు. అందుకే శ్రీ క్రిష్ణయ్య గారు పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు ఆహారం, ఆరోగ్యం మరియు కుటుంబ పరిస్థితులు, పాఠశాల పరిసరాల ప్రభావం వుంటుందని వక్కాణించారు. మొదటి గురువైన తల్లి బిడ్డల అనుబంధం గురించి చక్కగా వివరించారు. పిండదశలో శబ్ధ గ్రహణం గురించి చక్కగా తెలిపారు. ఆహారపు అలవాట్లు, వయస్సు - బరువుకు తగ్గ పోషకాహారం విలువల గూర్చి తెలిపారు. మంచి ఆహారం, రక్షిత మంచినీరు, సమాజానికి అవసరమైన మానవతా విలువలను వివరించారు. మనిషి జీవితంలో బాల్యమే ప్రధానమైనది. కనుక బాలలను రక్షించాలి.
ప్రతి తల్లిదండ్రి ఈ పుస్తకాన్ని చదివి తమ పిల్లల భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దుకో వలెనని నా అభ్యర్థన మరియు సలహా.

  Top  

A nation's destiny is shaped in the class-room

శ్రీ కేకలతూరి క్రిష్ణయ్య గారు బహు గ్రంథకర్త. ఈయన రచనలన్నీ వైవిధ్యభరితమైన అంశములతో కూడుకొన్నవి. నా దృష్టిలో ఈయన జీవితమే వైవిధ్యభరితమైనది. శ్రీ కె. క్రిష్ణయ్య గారు ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఒక క్రీడాకారుడు, ఒక ప్రైవేటు ఉద్యోగి, ఒక వైద్యుడు, ఒక వ్యవసాయ దారుడు, ఒక సర్వేయర్‌, ఒక ఇంజనీర్‌, ఒక కాంట్రాక్టర్‌, ప్రస్తుతము ఒక రచయిత, భవిష్యత్తులో. . . ?
ప్రస్తుతం శ్రీ కె. క్రిష్ణయ్య గారు రచించిన ‘‘పిల్లల పెంపక విజ్ఞానం పెద్దల బాధ్యత’’ అనే పుస్తకములో ఒక సందేశాత్మకమైన, బాధ్యతతో కూడిన, అంశాన్ని సమాజానికి తెలియజేస్తున్నారు.
కనడం అందరికీ తెలుసు - పెంచడం ఎందరికి తెలుసు? తెలిసినా ఎందరు అమలు చేయగలుగుతున్నారు? అమలు చేయకపోవడం వలన ప్రతక్ష్యంగా ఆయా తల్లి దండ్రులకు, పరోక్షంగా సమాజానికి కలిగే అరిష్టాలెన్ని? ప్రస్తుతం సమాజంలో పెరిగి పోతున్న చట్టబద్దం కాని పోకడలకు, వికృత చేష్టలకు ఎవరు బాధ్యులు?
పిల్లల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దడంలో తల్లి దండ్రులకు ఎంత బాధ్యత ఉందో అంతకు మించిన బాధ్యత ఉపాధ్యాయ లోకానిది. ప్రముఖ విద్యావేత్తయైన డా. కోఠారి గారి అభిప్రాయ ప్రకారము "A nation's destiny is shaped in the class-room".
బీదవారు తమ బిడ్డలకు మంచి పోషకాహారాన్ని ఇవ్వలేకపోవచ్చు. అందువల్ల వారి బిడ్డలలో కొందరు అనారోగ్యం పాలు కావచ్చు. మరి ఆర్ధిక బలము కలవారి బిడ్డలలో కూడా కొందరు శారీరక, మానసిక వ్యాధులకు గురియగుచున్నారు, ఎందువలన? అవగాహన లేకనా? ఉన్నా అమలు పరచకపోవడం వల్లనా? ఎందుకు అమలు పరచడం లేదు?
పై ప్రశ్నలన్నింటికి సమాధానములుగా శ్రీ కె. క్రిష్ణయ్య గారు ఎంతో శ్రమకోర్చి సమాజాభివృద్ధికి తన వంతు సేవ చేయాలి అనే బాద్యతతో ఈ పుస్తకము వెలవరించారని నా అభిప్రాయము.
ఈ పుస్తకమందలి విషయములను ప్రతి తల్లి తండ్రి చదివి అవగాహన చేసుకొని ఆచరించిన యెడల తమ బిడ్డలలో అపూర్వమైన ప్రగతిని చూడవచ్చు. ర్యాంకుల బిడ్డలనే కాక, సంస్కారవంతమైన నీతి నిజాయితీ గల, క్రమశిక్షణతో కూడిన, వినయ విధేయతలు గల, బాధ్యతాయుతమైన, జ్ఞానవంతులైన బిడ్డలను ప్రతి తల్లిదండ్రి చూచి మురిసిపోవచ్చును. ఉపాధ్యాయ లోకము ఆనందించవచ్చును.
సమాజానికి ఇంత మంచి పుస్తకాన్ని అందించిన శ్రీ కె. క్రిష్ణయ్య గారు అభినందనీయులు. ఇటువంటి మంచి పుస్తకములు ఇంకను వీరి కలం నుండి వెలువడాలని కోరుకుంటూ...

  Top  



Copyright © All rights reserved
Email